భూ ప్రకంపనలతో బెంబేలు | Small Earthquake In Bhadradri Kothagudem District | Sakshi
Sakshi News home page

భూ ప్రకంపనలతో బెంబేలు

Published Tue, Aug 14 2018 10:26 PM | Last Updated on Wed, Aug 15 2018 12:35 PM

Small Earthquake In Bhadradri Kothagudem District - Sakshi

సాక్షి, కొత్తగూడెం/మహబూబాబాద్‌: ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. భారీ శబ్ధాలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో 5 సెకన్లు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు తదితర మండలాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది.  అయితే ఎక్కడా ఆస్తి నష్టం జరగలేదు. మహబూబాబాద్‌లోని కంకరబోడ్‌లో ఉన్న సమైక్య డిగ్రీ కళాశాల సమీపంలో స్వల్ప భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement