ngri
-
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ)..ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 54 ► పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్. ► అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, నెట్/గేట్ అర్హత ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.05.2021 ► వెబ్సైట్: https://rectt.ngri.res.in/pas42021/ సీడ్యాక్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు -
హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్– నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ).. టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 38 ► పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–21, టెక్నికల్ ఆఫీసర్–06, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1–07, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–2–04. ► టెక్నికల్ అసిస్టెంట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. ► టెక్నికల్ ఆఫీసర్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–2: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1,2 పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.04.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: www.ngri.org.in డబ్ల్యూడీసీడబ్ల్యూలో 42 అంగన్వాడీ టీచర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ హైదరాబాద్ పరిధిలో గల ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 42 ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఐసీడీఎస్, చార్మినార్–08, ఐసీడీఎస్, గోల్కొండ–10, ఐసీడీఎస్, ఖైరతాబాద్–10, ఐసీడీఎస్, నాంపల్లి–09, ఐసీడీఎస్, సికింద్రాబాద్–05. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.05.2021 ► వెబ్సైట్: http://wdcw.tg.nic.in SBI Recruitment 2021: బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు 30వేల వేతనం -
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
సాక్షి, అమరావతి బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. వేకువజామున 2.37 నుంచి 2.50 గంటల మధ్య కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచి బయటకు పరుగులు తీశారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో, తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో మంచాలు అటూ ఇటూ ఊగాయి. ఎత్తులో ఉన్న సామాన్లు, వస్తువులు కింద పడ్డాయి. దీనికి తోడు పెద్దగా శబ్దాలు కూడా రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపంగా భావించి ఇళ్లల్లోంచి పిల్లా, పాపలతో రోడ్లపైకి పరుగెత్తారు. భూకంపం సంభవిస్తుందన్న భయంతో పలువురు ఉదయం వరకు మళ్లీ ఇళ్లల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూప్రకంపనలు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, గుంటూరు జిల్లా మాచవరం, బెల్లంకొండ, పిడుగురాళ్ల, అచ్చంపేట, తాడికొండ, క్రోసూరు, నాదెండ్ల, సత్తెనపల్లి తదితర మండలాల్లో అలజడి రేపాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వెలటూరులో ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైనట్టు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) గుర్తించింది. కాగా శనివారం టర్కీలో భారీ భూకంపం సంభవించిన కొన్ని గంటలకే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉండొచ్చని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ టర్కీ మన దేశానికి చాలా దూరంలో ఉండడం వల్ల దాని ప్రభావం కాదని నిపుణులు స్పష్టం చేశారు. నెల రోజుల్లో 300 సార్లు.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గత నెల రోజులుగా భూమి కంపిస్తోంది. ఒక్కోరోజు పదుల సంఖ్యలో ప్రకంపనాలు వస్తుండటం, ప్రజల భయాందోళనలతో ఈ నెల 12న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలోని దొండపాడుతోపాటు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద సిస్మోగ్రాఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు 300 సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. అయితే.. తీవ్రత 2.5 దాటలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంభవించిన భూప్రకంపనల తీవ్రత హైదరాబాద్ నగరాన్నీ తాకింది. అయితే దీని తీవ్రత నగరంలో తక్కువగానే ఉంది. బోయిన్పల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో వస్తువులు కిందపడిపోయాయి. -
మేఘాలయలో తేలని కార్మికుల జాడ
షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జైంతియా జిల్లాలో ఓ అక్రమ బొగ్గు గనిలో చిక్కుకున్న 15 మంది కార్మి కుల జాడ ఇంకా తెలియరావడం లేదు. అధికారులు శక్తిమంతమైన మోటార్ల సాయంతో ఇప్పటికే కోటి లీటర్ల నీటిని తోడేసినప్పటికీ 370 అడుగుల లోతున్న ఈ గనిలో నీటి మట్టం కొంచెం కూడా తగ్గలేదు. దీంతో పక్కనే ఉన్న గనుల నుంచి నీళ్లు వస్తుంటా యన్న అనుమానంతో వాటి నుంచి మరో 2 కోట్ల లీటర్ల నీటిని తోడేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. గతేడాది డిసెంబర్ 13న పక్కనే ఉన్న లైటన్‌నదిలోని నీరు గనిలోకి ఒక్కసారిగా పోటెత్తడంతో 15 మంది లోపల చిక్కుకు పోయారు. తాజాగా సుప్రీంకోర్టు పర్య వేక్షణలో సహాయక చర్యలు సాగుతున్నాయి. మరోవైపు కార్మికుల జాడను గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), గ్రా విటీ అండ్ మాగ్నటిక్ గ్రూప్‌కు చెందిన నిపు ణులు ఆదివారం గని వద్దకు చేరుకున్నారు. వీరికి అదనంగా చెన్నైకు చెందిన నీటిలో ప్రయానించే రిమోట్ కంట్రోల్ వాహనంతో పాటు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ విషయమై సీఎస్ఐఆర్ నిపుణుడు దేవాశిష్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 20 నుంచి గనిలో నీటిని తోడేస్తున్నప్పటికీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు అంతుపట్టడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్ సహా వేర్వేరు విభాగాలకు చెందిన 200 మంది నిపుణులు, సిబ్బంది కార్మికుల జాడ కనుగొనేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. -
భూ ప్రకంపనలతో బెంబేలు
సాక్షి, కొత్తగూడెం/మహబూబాబాద్: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. భారీ శబ్ధాలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో 5 సెకన్లు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు తదితర మండలాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే ఎక్కడా ఆస్తి నష్టం జరగలేదు. మహబూబాబాద్‌లోని కంకరబోడ్‌లో ఉన్న సమైక్య డిగ్రీ కళాశాల సమీపంలో స్వల్ప భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు. -
డిసెంబర్ 7 నుంచి సైన్స్ ఫెస్టివల్
హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని యువతకు పరిచయం చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ వి.ఎం.తివారీ తెలిపారు. ఢిల్లీలో డిసెంబరు 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ సైన్స్ ఫెస్టివల్ జరగనుందని హైదరాబాద్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. దేశ రాజధానిలో జరిగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు, యువతకూ దగ్గర చేసే లక్ష్యంతో ఎన్జీఆర్ఐ కూడా ఈ నెల 15వ తేదీ ‘ఓపెన్ డే’ పేరుతో అలాంటి కార్యక్రమాన్నే నిర్వహించనుందని వివరించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలతో విద్యార్థుల ముఖాముఖి, సైంటిఫిక్ వర్క్‌షాపులు ఉంటాయని, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుక్కునేందుకు జాతీయస్థాయిలో విద్యార్థుల కోసం పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, వాటివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తామన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామని తివారీ తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్‌తోనే క్వాలిటీ లైఫ్!
ఉప్పల్ : సైన్స్ తో పాటు టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసుకుంటేనే పరిశోధన సంస్థలు పేరు తెచ్చుకుంటాయని పద్మభూషణ్ వీకే సరస్వత్ అన్నారు. ఉప్పల్‌లోని భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) 55వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ ద్వారానే క్వాలిటీ లైఫ్ అందుతుందన్నారు. పాత రాతి యుగం నుండి నేటి వరకు మానవుడు అంచెలంచెలుగా ఎదగడానికి సన్సే కారణమన్నారు. అయితే, సైన్స్‌తో పాటు మానవ మనుగడకు హాని కలిగించే అంశాలు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటి సమస్యతో పాటు ఆహారోత్పత్తుల సమస్య కూడా పెరుగుతుందని, వీటిని అదిగమించడానికి సైన్స్ తోడ్పడేవిధంగా పరిశోధనలు జరగాలని సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని టెక్నాలజీ ద్వారానే అధిగమించవచ్చని సూచించారు. ప్రతి నిమిషంలో 30 మంది పట్టణాలకు వలస వస్తున్నారని దీని వల్ల పట్టణాలలో జనాభా అంతకంతకు పెరిగిపోతుందన్నారు. వీటన్నింటిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు మరిన్నీ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన కొరతలను అధిగమించాలని సూచించారు. ఎన్జీఆర్ఐ డెరైక్టర్ వీఎం తివారీ మాట్లాడుతూ ఎన్జీఆర్ఐ జరిపిన పరిశోధన ఫలితాలను, అభివృద్ధిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు, భాస్కర్‌రావు, సిస్మాలజీ హెచ్‌వోడీ సీనియర్ సైంటీస్ట్ నగేష్, షకీల్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
గరళానికి దూరంగా...
- జంట జలాశయాల పరిరక్షణకు ప్రణాళిక సిద్ధం - నెలరోజుల్లోగా మినీ ఎస్టీపీల - నిర్మాణానికి 45 ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు.. - రూ.35 కోట్ల అంచనా వ్యయంతో సమీప గ్రామాల్లో ఎస్టీపీల నిర్మాణం.. - ఎన్జీఆర్ఐ సౌజన్యంతో జలాశయం సరిహద్దుల గుర్తింపు, - డిజిటల్ మ్యాపుల తయారీ.. లేక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు వినతి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న చారిత్రక జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా గరళసాగరాలుగా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ప్రణాళికలో పొందుపరిచింది. జలాశయాల ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి నిత్యం మురుగునీరు సాగరాల్లోకిచేరకుండా ఆయా కళాశాలల యాజమాన్యాలు సొంతంగా చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాల(మినీ ఎస్టీపీలు)ను నెలరోజుల వ్యవధిలోగా నిర్మించుకోవాలని తాజాగా పీసీబీ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయించింది. లేని పక్షంలో ఆయా కళాశాలలను మూసివేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక సమీపంలోని 12 గ్రామాల నుంచి వెలువడుతున్న మురుగునీరు సైతం జలాశయాల్లోకి చేరకుండా ఉండేందుకు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల పరిధిలో మినీ ఎస్టీపీలను నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎన్జీఆర్ఐ సౌజన్యంతో సరిహద్దుల గుర్తింపు.. సుమారు పదివేల కి.మీల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జలాశయాల సరిహద్దులు,జి.ఓ.111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ పరిధి వరకు జలాశయాల సరిహద్దులను గుర్తించేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సహాయం తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. జీఐఎస్,శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికతో ఎన్జీఆర్ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరవాత డిజిటల్ మ్యాపులు సిద్ధంచేస్తారు. తద్వారా కబ్జాల నిరోధం, ఇసుక ఫిల్టర్లను నిర్వహిస్తున్న అసాంఘీక శక్తుల ఆటకట్టించవచ్చని జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియను చేపట్టాల్సిందిగా తాజాగా ఎన్‌జీఆర్‌ఐను సంప్రదించామని తెలిపాయి. కృష్ణా నాలుగోదశతో జలకళ.. ఈ జలాశయాల నుంచి రోజువారీగా సుమారు 40 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరిస్తున్నారు. అయితే వేసవిలో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో కృష్ణా నాలుగోదశ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవి పేట నుంచి నగరానికి తరలించనున్న కృష్ణాజలాలతో వీటిని నింపేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని నిర్ణయించారు. జంతు, వృక్ష అవశేషాలు ,గుర్రపుడెక్క తొలగింపు, జలాశయాల అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు రంగం సిద్ధంచేశారు. మరోవైపు నీటి రంగు మారకుండా జలాశయంలో ఏరియేషన్(ఆక్సిజన్‌స్థాయి పెంపునకు) వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. -
గుడి పైలమే..
రామప్ప వద్ద దేవాదుల అలైన్మెంట్ మార్పు.. సొరంగం స్థానంలో పైపులైన్ నిర్మాణం - రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు - ఎన్జీఆర్ఐ, సీడబ్ల్యూసీ సూచనలతో ప్లాన్ రూపకల్పన - ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ప్రాజెక్టు ఇంజినీర్లు హన్మకొండ : దేవాదుల మూడో దశలో భాగంగా రామప్ప ఆలయం వద్ద నిర్మించ తలపెట్టిన సొరంగం అలైన్మెంట్ మారింది. సొరంగం స్థానంలో పైపులైన్ నిర్మించనున్నారు. వెంకటాపురం మండలం పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో రెండేళ్ల క్రితం అక్కడ సొరంగం తవ్వకం పనులు నిలిపివేశారు. దేవాదుల మూడో దశలోని రెండో ప్యాకేజీలో భాగంగా భూపాలపల్లి మండలం భీంఘన్‌పూర్ నుంచి వెంకటాపురం మండలంలోని రామప్ప వరకు రూ.530.70 కోట్లతో 21 కిలోమీటర్ల సొరంగం, మరో 4 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ తవ్వేందుకు 2009 జనవరిలో టెండర్లు పిలవగా... ఫిబ్రవరి 28న అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తరుంది. మూడేళ్ల గడువుతో 2012 ఫిబ్రవరి 27 వరకు పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదిరింది. కానీ... ఇప్పటివరకు భీంఘన్‌పూర్ నుంచి మధ్య మధ్యలో మొత్తం మూడు కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్... రెండు కిలోమీటర్ల సొరంగం మాత్రమే తవ్వారు. ఈ 21 కిలోమీటర్ల పరిధిలో సొరంగం తవ్వకాల కోసం ఐదు అడిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. గొల్లబుద్దారం, గండి కామారం, రామకృష్ణాపూర్, నల్లకుంట, పాలంపేట వద్ద అడిట్ పాయింట్లు గుర్తించారు. వీటిలో గొల్ల బుద్దారం, గండికామారం, రామకృష్ణాపూర్ వద్ద అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వెంకటాపురం మండలంలోని నల్లకుంట, పాలంపేటలో సొరంగం తవ్వకం పనులు ప్రారంభమయ్యూరు. పాలంపేట నుంచి రామప్ప ఆలయూనికి 2 కి.మీల దూరం ఉంటుంది. పాలంపేట అడిట్ పాయింట్ నుంచి 1.86 కి.మీల మేర సొరంగం తవ్వకం పనులు చేశారు. ఈ క్రమంలో పేలుళ్లతో ఆలయానికి ప్రమాదం ఉందని... సొరంగం పక్కనే 0.89 కిలోమీటర్ల దూరంలో సింగరేణి భూగర్భ గనులు అడ్డురావడం వంటి కారణాలతో పాలంపేట వద్ద పనులు రెండేళ్ల క్రితం ఆగిపోయూరు. ఆ తర్వాత ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు సంయుక్తంగా పలు దఫాలుగా అక్కడ పరిశీలనలు జరిపారు. దీంతో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఇక్కడ పరిశీలన చేయాలని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థను (ఎన్జీఆర్ఐ) కోరగా.. వారు ఇక్కడ పరిశీలన జరిపి బాంబు పేలుళ్ల స్థాయి తగ్గించాలని సూచించింది. అయితే ఎన్జీఆర్ఐ సూచించిన స్థాయిలో పేలుళ్లు జరిపితే... తట్టెడు మట్టి కూడా బయటకు రాదని దేవాదుల ఇంజినీర్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖ సూచనలతో ఎన్జీఆర్ఐ, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు. పలు సూచనలు చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతోపాటు పనులు చేస్తున్న కంపెనీ కూడా కష్టమని చెప్పడంతో భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు సొరంగం అలైన్మెంట్ మార్పునకు దేవాదుల ఇంజినీర్లు ప్లాన్ వేశారు. ఎన్జీఆర్ఐ నివేదికలు, కేంద్ర జల వనరుల సంఘం ఇంజినీర్ల సూచనలు... ఇలా పలు రిపోర్టుల ఆధారంగా సొరంగానికి బదులుగా పైపులైన్ నిర్మాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలని సర్కారుకు నివేదించారు. పైపులైన్ నిర్మాణంతో అదనపు భారం ఉండదని, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయని, భూ సేకరణ పూర్తరుునందున పనులు త్వరగా చేపట్టవచ్చని నివేదికల్లో పొందుపరిచారు. అంతేకాదు... మొదటి, రెండో దశల పైపులైన్ నిర్మాణం పూర్తి చేసి ఉన్నామని, వాటి పక్క నుంచి మూడో దశ పైపులైన్ వేయడం తేలికగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం సొరంగం పనులకు ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉంటుందని... పైపులైన్ నిర్మాణానికి అవసరం లేదని నివేదికల్లో పేర్కొన్నారు. భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు 21 కిలోమీటర్లలో రామప్ప వద్ద కేవలం 2 కిలోమీటర్ల మేరకు పైపులైన్ నిర్మాణానికి అనువుగా ఉందని... అక్కడ నుంచి ధర్మసాగర్ వరకు సొరంగం పనులు చేసేందుకు అనువుగా ఉందని నివేదికల్లో జోడించారు. దేవాదుల మూడో దశ మొదటి ప్యాకేజీలో ఇన్‌టేక్‌వెల్ నుంచి భీంఘన్‌పూర్ వరకు 39 కిలోమీటర్ల దూరంలో వేస్తున్న పైపులైన్ తరహాలోనే... మూడో దశలోని ఈ రెండో ప్యాకేజీకి కూడా పైపులైన్ నిర్మాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సాగునీటి ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో దేవాదుల మూడో దశ నిర్మాణ పనులపై ఆరా తీసింది. మరోమారు పరిశీలన జరిపి రామప్ప వద్ద సొరం గం పనుల అలైన్మెంట్ మార్పు, పైపులైన్ డిజైన్లతో నివేదిక పంపించాలని దేవాదుల ఇంజినీర్లను ఆదేశించింది. దీంతో వారు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదికలు, డిజైన్లను పంపించారు.