షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జైంతియా జిల్లాలో ఓ అక్రమ బొగ్గు గనిలో చిక్కుకున్న 15 మంది కార్మి కుల జాడ ఇంకా తెలియరావడం లేదు. అధికారులు శక్తిమంతమైన మోటార్ల సాయంతో ఇప్పటికే కోటి లీటర్ల నీటిని తోడేసినప్పటికీ 370 అడుగుల లోతున్న ఈ గనిలో నీటి మట్టం కొంచెం కూడా తగ్గలేదు. దీంతో పక్కనే ఉన్న గనుల నుంచి నీళ్లు వస్తుంటా యన్న అనుమానంతో వాటి నుంచి మరో 2 కోట్ల లీటర్ల నీటిని తోడేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. గతేడాది డిసెంబర్ 13న పక్కనే ఉన్న లైటన్‌నదిలోని నీరు గనిలోకి ఒక్కసారిగా పోటెత్తడంతో 15 మంది లోపల చిక్కుకు పోయారు. తాజాగా సుప్రీంకోర్టు పర్య వేక్షణలో సహాయక చర్యలు సాగుతున్నాయి.
మరోవైపు కార్మికుల జాడను గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్), గ్రా విటీ అండ్ మాగ్నటిక్ గ్రూప్‌కు చెందిన నిపు ణులు ఆదివారం గని వద్దకు చేరుకున్నారు. వీరికి అదనంగా చెన్నైకు చెందిన నీటిలో ప్రయానించే రిమోట్ కంట్రోల్ వాహనంతో పాటు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ విషయమై సీఎస్‌ఐఆర్ నిపుణుడు దేవాశిష్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 20 నుంచి గనిలో నీటిని తోడేస్తున్నప్పటికీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు అంతుపట్టడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ, నేవి, ఎన్డీఆర్‌ఎఫ్ సహా వేర్వేరు విభాగాలకు చెందిన 200 మంది నిపుణులు, సిబ్బంది కార్మికుల జాడ కనుగొనేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment