తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో పోలింగ్ వంద శాతం నమోదైంది. మొత్తం 59 మంది ఓటర్లు తమ ఎటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 38 మహిళా ఓటర్లు ఉండగా, 21 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పాల్వంచలో 11 గంటల సమయానికి 68 శాతం పోలింగ్ నమోదైంది.
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో 88 శాతం పోలింగ్ నమోదైంది. 212 ఓట్లకు ఇప్పటి వరకు 183 ఓట్లు పోలయ్యాయి. మహబూబ్ నగర్ డివిజన్ లో 12 గంటల వరకు 78 శాతం పోలింగ్ నమోదైంది. తమ ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా రాజకీయ పార్టీలు క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుండి నేరుగా బస్సుల ద్వారా మూకుమ్మడిగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలిస్తున్నాయి.