కేటీపీఎస్‌లో అగ్నిప్రమాదం: నిలిచిన ఉత్పత్తి | fire accident in palwancha KTPS | Sakshi
Sakshi News home page

కేటీపీఎస్‌లో అగ్నిప్రమాదం: నిలిచిన ఉత్పత్తి

Published Tue, Sep 19 2017 12:46 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in palwancha KTPS

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్‌ 11వ యూనిట్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. 11వ యూనిట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement