రూ. 10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
పాల్వంచ: భద్రాద్రి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయి ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద ఆదివారం ఉదయం అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
బోలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకొని అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని పాల్వంచ డిపోకు తరలించారు.