ఖమ్మం/ఒంగోలు: పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో నగల కోసం ఓ వృద్ధురాలిని ఆగంతకులు గత అర్థరాత్రి హత్య చేశారు. అనంతరం ఆమె వద్ద గల లక్షా 50 వేల విలువైన బంగారు అభరాణాలను అపహరించారు.శుక్రవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వృద్దురాలి హత్యపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అలాగే ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రబెల్లి వద్ద టవేరా వాహనం శుక్రవారం బోల్తా పడింది. ఆ ఘటనలో ఒక్కరు అక్కికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టవేరా వాహనం భద్రచలం నుంచి వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు.