సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని ఆళ్లగడ్డలో శోభారాణి అనే మహిళ స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు డీఆర్‌సీ మీటింగ్ ఉండటంతో ఆమె కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. మీటింగ్ జరుగుతుండగానే శోభారాణి భవనంపైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై ఆస్పత్రికి తరలించే లోపలే శోభారాణి మృతి చెందింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహ్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
మనోవేదనకు గురి చేశారు
తన భార్య శోభారాణి ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. ఆరోగ్యం బాగలేకపోయినా.. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురి చేశారన్నారు. వేధింపులు తట్టుకోలేక ఆమె బలవన్మరణం చెందిందన్నారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అతను డిమాండ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment