భర్త తాగొచ్చాడని భార్య ఆత్మహత్య | Women Suicide In YSR Kadapa | Sakshi
Sakshi News home page

భర్త తాగొచ్చాడని భార్య ఆత్మహత్య

Published Sun, Jul 8 2018 10:04 AM | Last Updated on Sun, Jul 8 2018 10:04 AM

Women Suicide In YSR Kadapa - Sakshi

రోదిస్తున్న మృతురాలి తల్లి (ఇన్‌సెట్‌) సుబ్బలక్ష్మి (ఫైల్‌)

రాజుపాళెం : భర్త మద్యం తాగొచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొర్రపాడులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిం ది. కొర్రపాడు గ్రామానికి చెందిన కృష్ణపట్నం శివాంజనేయులుకు జమ్మలమడుగు మండలంలోని ఎస్‌.ఉప్పలపాడు గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (30)తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి శివకుమార్‌ (10), సుదర్శన్‌ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివాంజనేయులు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలం వారి కాపురం అన్యోన్యంగా సాగింది. తర్వాత మద్యం వారి పాలిట శాపం అయింది. అతను తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చే వాడు.

మానేయ్యాలని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడూ గొడవ పడే వారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మానేయాలని చెబుతూ గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటకుమాట పెరిగింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోతానని ఆమె చెప్పింది. నీవు ఎందుకు పోవడం, తానే వెళ్తానని అతను ఇంటి నుంచి కొంత దూరం బయటకు వచ్చేశాడు. తాను ఎంత చెప్పినా భర్త మద్యం మానలేదని జీవితంపై విరక్తి చెందింది. ఇంటి తలుపు వేసి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అతనితోపాటు కుటుంబ సభ్యులు వెంటనే తలుపు పగులగ్గొట్టి ఇంట్లోకి వెళ్లారు

 ఆమెను రక్షించేందుకు ఆటోలో ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ ఓబులేసు, రాజుపాళెం ఎస్‌ఐ శ్రీనివాసులు చేరుకుని పరిశీలించారు. మృతురాలు తమ్ముడు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement