busband
-
సగం కాలిన శవంతో రోడ్డుపై ఆందోళన
బీహార్‌లోని మోతిహరిలో ఒక నవవివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే అత్తింటివారు తమ అమ్మాయిని హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను హ్యత చేసి, మృతదేహానికి రహస్యంగా దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా, తమకు గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో, తాము పెంటనే ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. గ్రామానికి వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు చితిపై మండుతున్న మృతదేహాన్ని బయటకు తీసి రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ కుమార్తె చేతులు, కాళ్లు కట్టేసి, ఆమె గొంతునొక్కి చంపేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థాలానికి చేరుకుని, మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు. పోలీసులు మృతురాలిని సుగౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీపుర్ గోపాల్‌పుర్ నివాసి పారస్ వర్మ కుమార్తె ఫూల్‌పరి దేవి(20)గా గుర్తించారు. మృతురాలి తండ్రి గతంలోనే మరణించాడు. దీంతో తల్లి కూలీనాలీ చేస్తూ కుమార్తెను చదివించింది. మృతురాలి తల్లి రామ్‌వతి మాట్లాడుతూ తన కుమార్తెకు టోలా గ్రామానికి చెందిన సుభుశ్ శర్మ కుమారుడు నితేష్ కుమార్‌తో ఈ ఏడాది మార్చ 8న వివాహం చేశానని తెలిపారు. పెళ్లయిన తరువాత నుంచి అత్తింటివారు తమ కుమార్తెను వరకట్న వేధింపులకు గురిచేశారన్నారు. ఐదు లక్షల రూపాయలతో పాటు ఒక బైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. పెళ్లయిన నాటి నుంచి తమ కుమార్తెను వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో తొలి సామూహిక గణేశ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతకుముందు ఏం జరిగింది? -
‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి..
‘మీనాక్షికి చదువంటే ఎంతో ఇష్టం. నేను లక్ష రూపాయలు ఖర్చుచేసి ఆమెకు జీఎన్ఎం ట్రైనింగ్ ఇప్పించాను. ఇందుకోసం బీమా పాలసీ కూడా వదులుకున్నాను. ఇప్పుడు మీనాక్షి నన్ను గుర్తించేందుకు కూడా ఇష్టపడటం లేదు. నన్ను తన భర్తగా అంగీకరించడం లేదు. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని, నన్ను ఇంకొకరిని చూసుకోమని చెబుతోంది’ ‘ఆమె చదువు కోసం లక్షలు ఖర్చు చేశా’ యూపీలోని అనూప్పూర్ జిల్లాలోని పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా తన గోడును అనూప్పూర్ కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు వచ్చాడు. తన భార్య మీనాక్షి తన దగ్గరకు రావడం లేదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లాయ్యాక ఆమె చదువుకోసం ఎంతో ఖర్చు చేశాను. ఇప్పుడు కనీసం నావైపు చూడటం లేదు. కుమార్తెను కూడా తనతోపాటు తీసుకువెళ్లిపోయింది. తన భార్య తన దగ్గరకు వచ్చేలా చేయండి అని వేడుకున్నాడు. ‘అప్పటికే మీనాక్షికి పెళ్లయ్యింది’ తమకు పెళ్లయ్యే నాటికే మీనాక్షికి వివాహం అయ్యిందని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండేదని, ఆ సమయంలోనే ఆమెతో తనకు పరిచయం అయ్యిందని జోహన్ తెలిపాడు. ఆమె ఇంటిలోనివారు అభ్యంతరం చెప్పినా, తాను వారిని ఎదిరించి మీనాక్షిని వివాహం చేసుకున్నానని తెలిపాడు. తరువాత తమకు కుమార్తె పుట్టిందన్నాడు. మీనాక్షి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండేదని, నర్సు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించేదని, ఆమె నర్సింగ్ శిక్షణకు తాను లక్షా 15 వేలు ఖర్చు చేశానని జోహన్ పేర్కొన్నాడు. బీమా పాలసీ వదులుకుని మరీ ఆమె చదువుకు వెచ్చించానని తెలిపాడు. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ రావడంతో అక్కడికి వెళ్లిపోయిందన్నారు. ‘కుమార్తెనూ లాక్కుపోయారు’ నర్సు అయ్యాక మీనాక్షి ధోరణి పూర్తిగా మారిపోయిందని, తన దగ్గరకు రావడం మానేసిందని, పుట్టింటిలోనే ఉంటున్నదని, తాను ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలినా తనను భర్త కాదు పొమ్మంటున్నదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలోకి మరొకరు వచ్చారని, తనను మరో వివాహం చేసుకొమ్మంటున్నదని జోహర్ తెలిపాడు. తమ కుమార్తెను మీనాక్షి అన్నదమ్ములు బలవంతంగా వారితో పాటు తీసుకుపోయారని జోహన్ తెలిపాడు. మీనాక్షి వలన తాను అప్పుల పాలయ్యానని, ఆమె తిరిగి తన దగ్గరకు వచ్చేలా చూడాలని జోహన్ కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. ఇది కూడా చదవండి: లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు -
భర్త తాగొచ్చాడని భార్య ఆత్మహత్య
రాజుపాళెం : భర్త మద్యం తాగొచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొర్రపాడులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిం ది. కొర్రపాడు గ్రామానికి చెందిన కృష్ణపట్నం శివాంజనేయులుకు జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (30)తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి శివకుమార్ (10), సుదర్శన్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివాంజనేయులు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలం వారి కాపురం అన్యోన్యంగా సాగింది. తర్వాత మద్యం వారి పాలిట శాపం అయింది. అతను తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చే వాడు. మానేయ్యాలని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడూ గొడవ పడే వారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మానేయాలని చెబుతూ గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటకుమాట పెరిగింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోతానని ఆమె చెప్పింది. నీవు ఎందుకు పోవడం, తానే వెళ్తానని అతను ఇంటి నుంచి కొంత దూరం బయటకు వచ్చేశాడు. తాను ఎంత చెప్పినా భర్త మద్యం మానలేదని జీవితంపై విరక్తి చెందింది. ఇంటి తలుపు వేసి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అతనితోపాటు కుటుంబ సభ్యులు వెంటనే తలుపు పగులగ్గొట్టి ఇంట్లోకి వెళ్లారు ఆమెను రక్షించేందుకు ఆటోలో ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి ప్రొద్దుటూరు రూరల్ సీఐ ఓబులేసు, రాజుపాళెం ఎస్ఐ శ్రీనివాసులు చేరుకుని పరిశీలించారు. మృతురాలు తమ్ముడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. -
భర్తను కట్టేసి.. ఊపిరాడకుండా చేసి..!
నిద్రపోతున్న భర్తను కాళ్లు, చేతులు కట్టేసి ముఖం చుట్టూ పాలిథిన్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేయడానికి ప్రయత్నించిందో మహిళ. అంతే కాదు, ఆ తర్వాత కట్టెతో కొట్టి, కొడవలితో దాడి కూడా చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుపూర్‌లో భర్త కన్నన్‌తో గొడవ జరగడంతో వంజియమ్మళ్ అనే మహిళ అతడిని హతమార్చాలన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. భార్య తనను అశక్తుడిని చేసి చంపేస్తుండటంతో అతడు అరవసాగాడు. అతడి అరుపులు విన్న పిల్లలు లేచి, వాళ్లూ భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచి వెంటనే అక్కడకు చేరుకుని అతడిని కాపాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత వంజియమ్మాళ్ పోలీసుల వద్ద లొంగిపోయింది. తన భర్త పెట్టే చిత్రహింసలను భరించలేకే ఇలా చేసినట్లు ఆమె తెలిపింది.