‘మీనాక్షికి చదువంటే ఎంతో ఇష్టం. నేను లక్ష రూపాయలు ఖర్చుచేసి ఆమెకు జీఎన్‌ఎం ట్రైనింగ్ ఇప్పించాను. ఇందుకోసం బీమా పాలసీ కూడా వదులుకున్నాను. ఇప్పుడు మీనాక్షి నన్ను గుర్తించేందుకు కూడా ఇష్టపడటం లేదు. నన్ను తన భర్తగా అంగీకరించడం లేదు. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని, నన్ను ఇంకొకరిని చూసుకోమని చెబుతోంది’
‘ఆమె చదువు కోసం లక్షలు ఖర్చు చేశా’
యూపీలోని అనూప్‌పూర్ జిల్లాలోని పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా తన గోడును అనూప్‌పూర్ కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు వచ్చాడు. తన భార్య మీనాక్షి తన దగ్గరకు రావడం లేదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లాయ్యాక ఆమె చదువుకోసం ఎంతో ఖర్చు చేశాను. ఇప్పుడు కనీసం నావైపు చూడటం లేదు. కుమార్తెను కూడా తనతోపాటు తీసుకువెళ్లిపోయింది. తన భార్య తన దగ్గరకు వచ్చేలా చేయండి అని వేడుకున్నాడు.
‘అప్పటికే మీనాక్షికి పెళ్లయ్యింది’
తమకు పెళ్లయ్యే నాటికే మీనాక్షికి వివాహం అయ్యిందని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండేదని, ఆ సమయంలోనే ఆమెతో తనకు పరిచయం అయ్యిందని జోహన్ తెలిపాడు. ఆమె ఇంటిలోనివారు అభ్యంతరం చెప్పినా, తాను వారిని ఎదిరించి మీనాక్షిని వివాహం చేసుకున్నానని తెలిపాడు. తరువాత తమకు కుమార్తె పుట్టిందన్నాడు. మీనాక్షి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండేదని, నర్సు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించేదని, ఆమె నర్సింగ్ శిక్షణకు తాను లక్షా 15 వేలు ఖర్చు చేశానని జోహన్ పేర్కొన్నాడు. బీమా పాలసీ వదులుకుని మరీ ఆమె చదువుకు వెచ్చించానని తెలిపాడు. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ రావడంతో అక్కడికి వెళ్లిపోయిందన్నారు.
‘కుమార్తెనూ లాక్కుపోయారు’
నర్సు అయ్యాక మీనాక్షి ధోరణి పూర్తిగా మారిపోయిందని, తన దగ్గరకు రావడం మానేసిందని, పుట్టింటిలోనే ఉంటున్నదని, తాను ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలినా తనను భర్త కాదు పొమ్మంటున్నదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలోకి మరొకరు వచ్చారని, తనను మరో వివాహం చేసుకొమ్మంటున్నదని జోహర్ తెలిపాడు. తమ కుమార్తెను మీనాక్షి అన్నదమ్ములు బలవంతంగా వారితో పాటు తీసుకుపోయారని జోహన్ తెలిపాడు. మీనాక్షి వలన తాను అప్పుల పాలయ్యానని, ఆమె తిరిగి తన దగ్గరకు వచ్చేలా చూడాలని జోహన్ కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు.
ఇది కూడా చదవండి: లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు
Comments
Please login to add a commentAdd a comment