collecorate
-
‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి..
‘మీనాక్షికి చదువంటే ఎంతో ఇష్టం. నేను లక్ష రూపాయలు ఖర్చుచేసి ఆమెకు జీఎన్ఎం ట్రైనింగ్ ఇప్పించాను. ఇందుకోసం బీమా పాలసీ కూడా వదులుకున్నాను. ఇప్పుడు మీనాక్షి నన్ను గుర్తించేందుకు కూడా ఇష్టపడటం లేదు. నన్ను తన భర్తగా అంగీకరించడం లేదు. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని, నన్ను ఇంకొకరిని చూసుకోమని చెబుతోంది’ ‘ఆమె చదువు కోసం లక్షలు ఖర్చు చేశా’ యూపీలోని అనూప్పూర్ జిల్లాలోని పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా తన గోడును అనూప్పూర్ కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు వచ్చాడు. తన భార్య మీనాక్షి తన దగ్గరకు రావడం లేదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లాయ్యాక ఆమె చదువుకోసం ఎంతో ఖర్చు చేశాను. ఇప్పుడు కనీసం నావైపు చూడటం లేదు. కుమార్తెను కూడా తనతోపాటు తీసుకువెళ్లిపోయింది. తన భార్య తన దగ్గరకు వచ్చేలా చేయండి అని వేడుకున్నాడు. ‘అప్పటికే మీనాక్షికి పెళ్లయ్యింది’ తమకు పెళ్లయ్యే నాటికే మీనాక్షికి వివాహం అయ్యిందని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండేదని, ఆ సమయంలోనే ఆమెతో తనకు పరిచయం అయ్యిందని జోహన్ తెలిపాడు. ఆమె ఇంటిలోనివారు అభ్యంతరం చెప్పినా, తాను వారిని ఎదిరించి మీనాక్షిని వివాహం చేసుకున్నానని తెలిపాడు. తరువాత తమకు కుమార్తె పుట్టిందన్నాడు. మీనాక్షి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండేదని, నర్సు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించేదని, ఆమె నర్సింగ్ శిక్షణకు తాను లక్షా 15 వేలు ఖర్చు చేశానని జోహన్ పేర్కొన్నాడు. బీమా పాలసీ వదులుకుని మరీ ఆమె చదువుకు వెచ్చించానని తెలిపాడు. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ రావడంతో అక్కడికి వెళ్లిపోయిందన్నారు. ‘కుమార్తెనూ లాక్కుపోయారు’ నర్సు అయ్యాక మీనాక్షి ధోరణి పూర్తిగా మారిపోయిందని, తన దగ్గరకు రావడం మానేసిందని, పుట్టింటిలోనే ఉంటున్నదని, తాను ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలినా తనను భర్త కాదు పొమ్మంటున్నదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలోకి మరొకరు వచ్చారని, తనను మరో వివాహం చేసుకొమ్మంటున్నదని జోహర్ తెలిపాడు. తమ కుమార్తెను మీనాక్షి అన్నదమ్ములు బలవంతంగా వారితో పాటు తీసుకుపోయారని జోహన్ తెలిపాడు. మీనాక్షి వలన తాను అప్పుల పాలయ్యానని, ఆమె తిరిగి తన దగ్గరకు వచ్చేలా చూడాలని జోహన్ కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. ఇది కూడా చదవండి: లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు -
ఉపకార వేతనాల దరఖాస్తులను అందజేయండి
సాక్షి,సిటీబ్యూరో: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు వెంటనే జిల్లా ఎస్సీ సంక్షేమాధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, విద్యార్థుల దరఖాస్తుల సమర్పించడంలో జరుగుతున్న జాప్యం పై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, వృత్తి విద్య కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులను వసతి గృహ అధికారులు ఈ నెల 28 లోగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ప్రతి షెడ్యూల్ కులాల విద్యార్థిచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామారావు, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు, ఏఎస్ఓలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్ రైతు భరోసా ప్రతి రైతుకూ అందాలి
సాక్షి, చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకూ రూ.12,500 అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శుక్రవారం వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 15వ తేదీ నాటికి రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అందించే నగదుకు సంబంధించి రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. కౌలు రైతుల గుర్తింపును పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న మూడు లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయశాఖ ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా రైతులకు న్యాయమైన ఎరువులు, విత్తనాలను ఈ ప్రయోగ కేంద్రాల ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో పెద్ద, చిన్న గ్రామాలను ఆదర్శగ్రామాలుగా ఎంపిక చేసుకుని ఎరువులు, విత్తనాలు పంపిణీ ఏ విధంగా జరుగుతుందో అధ్యయనం చేయాలన్నారు. అధ్యయనంలో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని జిల్లా అంతా పంపిణీ కోసం మార్గదర్శకాలు రూపొందించుకోవాలన్నారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా జిల్లాలో రెండు రోజుల్లో జరగనున్న మేళా కార్యక్రమంలో సుమారు 10వేల మంది రైతులు అప్పటికప్పుడు ఈ పథకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలుగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా 1281 హెక్టార్లలోని పంటభూములు పూర్తిగా ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారన్నారు. వీటి కోసం రూ.1.83 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. 4,200 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 53.8 హెక్టార్లలో సెరీకల్చర్ పంటలు దెబ్బతిన్నాయన్నారు. నవంబరు 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి మత్స్యకారు కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించేలా జాబితా రూపొందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, మత్స్యశాఖ జేడీ యాకూబ్‌బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్డు సచివాలయ కార్యాలయం భవనాలు సిద్ధం చేయండి వార్డు సచివాలయ కార్యాలయాల కోసం అనువైన భవనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. మచిలీపట్నంలోని ఆయన చాంబర్ నుంచి కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 2వ తేదీ నుంచి వార్డు వలంటీర్లు, సెక్రటేరియట్ల ఉద్యోగుల కోసం కార్యాలయాలు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో త్వరలో పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అవసరమైన భవనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికే మునిసిపాలిటీల్లో వార్డు వలంటీర్ల నియామకం జరిగిందని, ఏయే వార్డుల్లో ఖాళీలు ఉన్నాయో పరిశీలించాలన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు కోసం జగ్గయ్యపేట, ఉయ్యూరు, గుడివాడ, తిరువూరు మునిసిపాలిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం కోసం స్థలాలను ఎంపిక చేయాలన్నారు. ఎంత మందికి స్థలాలు అవసరమవుతాయో ప్రతిపాదనలు తయారుచేసి అం దుకు తగిన విధంగా స్థలాలను గుర్తించాలన్నా రు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 మోహ న్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్ పాల్గొన్నారు. నిబంధనలకు అనుగుణంగా గోశాలలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా గోశాలలు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శుక్రవారం గోశాలల నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాలల నిర్వహణ లోపం కారణంగా ఇటీవల విజయవాడలో సుమారు 100 ఆవులు మృత్యువాతపడ్డాయన్నారు. గోశాలల్లో సరైన సంరక్షణ, పోషణ, వైద్యసేవలు గోవులకు అందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 27 గోశాలలు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం సహకారాన్ని అందిస్తామన్నారు. పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ రమేష్ మాట్లాడుతూ కబేళాకు తరలిస్తున్న గోవులను పట్టుకుని గోశాలలకు అప్పగించాలని చూస్తే వసతికి సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సుమారు 8 ఎకరాల్లో ప్రత్యేక పశువుల వసతి కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గడ్డి కోసే యంత్రాలు 50 శాతం సబ్సిడీతో గోశాలల నిర్వహణకు అందించనున్నామన్నారు. గోశాలలకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో వెటర్నరీ వైద్యులను నియమించామని, వీరు 15 రోజులకు ఒకసారి గోశాలకు వెళ్లి వైద్యసహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాలని సూ చించామన్నారు. బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ మచిలీపట్నంలోని రోడ్లపై పశువుల సంచారం ఎక్కువగా ఉందని వీటిని నియంత్రించేందుకు పశువులను తరలించా లంటే గోశాలల్లో భూములు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, విజయవాడ అడిషనల్ డీసీపీ–2 చంద్రశేఖర్ ఇతర అధికారులు, గోశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి మహిళలను, బాలికలను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో శుక్రవారం సెక్స్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పేదరికం కారణంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి మహిళలను, బాలికలను వ్యభిచారంలోకి దించుతున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. మహిళలపై అత్యాచారాల నిరోధానికి తమిళనాడుకు చెందిన ఐజేఎం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ స్వచ్ఛంద సంస్థ సెక్స్ ట్రాఫికింగ్ నిర్మూలనపై చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు. జిల్లాలో మహిలల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నిరుపేదలైన అభ్యాగులు, అనాథలు, విభిన్న ప్రతిభావంతులను సరైన సంరక్షణ లేకుండా వదిలేస్తున్నారన్నారు. అటువంటి వారిని బాలకార్మిక నిర్మూలన సంస్థ, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వారిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్, బీసీ సంక్షేమశాఖ డీడీ భార్గవి తదితర అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో దొంగలు పడ్డారు!
2018 అక్టోబరు 11.. తిత్లీ తుపాను జిల్లాను అతలాకుతలం చేసిన రోజు.. ఈ విపత్తు ధాటికి 11 మండలాల్లోని దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు దారుణంగా చితికిపోయిన దుర్దినం.. తుపాను వెలసి ఆరు నెలలైనా సహాయ చర్యల పేరిట నిధుల స్వాహా మాత్రం ఇంకా ఆగలేదు. బాధితుల పునరావాస, తక్షణ సహాయ చర్యల కోసం టీఆర్ 27 బిల్లు ఆధారంగా అధికారులు కావాల్సినన్ని నిధులు ఖజానా శాఖ నుంచి తీసుకోవచ్చు. అలాగే ఎలాంటి వివరాలు లేకుండా అబస్టాట్ కంటింజెన్సీ (ఏసీ) బిల్లులు సమర్పించే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే జీవో ప్రకారం వీటిని విపత్తు తర్వాత ఒకటీ రెండు వారాల్లో ఖజానా శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఆరు నెలల తర్వాత టీఆర్ 27 బిల్లు కింద కొత్త ఏసీ బిల్లులు రూ.3.10 కోట్లకు సృష్టించారు. జిల్లా కలెక్టరు సంతకం లేకుండానే వాటిని ఖజానా శాఖకు సమర్పించి అందినకాడికి నొక్కేయడానికి పెద్ద పన్నాగమే పన్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ బాధితులకు అందాల్సిన సొమ్మును అధికార పార్టీ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మకై నొక్కేసిన లీలలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇది చాలదన్నట్లుగా మరో రూ.3.10 కోట్ల మేర మెక్కేసేందుకు భారీ స్కెచ్ వేశారు. వాస్తవానికి టీఆర్ 27 బిల్లును విపత్తుల సమయంలో మాత్రమే వాడాలి. అయి తే అత్యవసర సహాయ, పునరావాస చర్యలకు ఆటంకం కలగకుండా ఈ పద్దులో అవసరమైన నగదును ఖజానా శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఆ ఖర్చుకు సంబంధించి డీటెయిల్డ్ కంటింజెంట్ (డీసీ) బిల్లు పెట్టడానికి సాధ్యం కాదు కాబట్టి అబస్టాట్ కంటింజెన్సీ (ఏసీ) బిల్లులను పెడతారు. వాటిపై జిల్లా కలెక్టరు సిఫారసు ఉండాలి. ఆ బిల్లులను విపత్తు తర్వాత ఒకటీ రెండు వారాల గడువులోనే ఖజానా శాఖకు పంపాలి. ఆ తరువాత ఏసీ బిల్లులు పెట్టడం కుదరదు. ఆర్నెల్ల తర్వాత కుతంత్రం తెరపైకి... తిత్లీ తుపాను పోయిన ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా దాదాపు రూ.3.10 కోట్ల మేర ఏసీ పద్దు కింద దొంగ బిల్లులు సృష్టించారు. వాస్తవానికి ఈ బిల్లులు పెట్టినప్పుడు అక్కడ డ్రాయింగ్ అధికారి (డీడీవో)గా ఉన్న కలెక్టరేట్ పరిపాలనాధికారి (ఏవో) వాటిని రూపొందించి, దానిపై సంతకం చేసి ఖజానా శాఖకు అందజేయాల్సి ఉంది. అయితే ఆర్నెల్ల తర్వాత పెడుతున్న రూ.3.10 కోట్ల ఏసీ బిల్లులపై ఎవరు సంతకం చేయాలి? నిబంధనల ప్రకారం ఖజానా శాఖకు బిల్లు పెట్టిన సమయంలో ఉన్న జిల్లా కలెక్టరు, డీడీవో సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రూ.3.10 కోట్ల ఏసీ బిల్లులపై ఎవరు సంతకం చేశారనేదీ బయటకు తెలియనీయట్లేదు. తిత్లీ తుపాను సమయంలో జిల్లా కలెక్టరుగా ఉన్న కె.ధనంజయరెడ్డి ఫిబ్రవరి 8వ తేదీన బదిలీపై అమరావతికి వెళ్లిపోయారు. తర్వాత ఆయన స్థానంలో వచ్చిన ఎం.రామారావు కూడా పదిహేను రోజులకే బదిలీ అయ్యారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరుగా వచ్చిన జె.నివాస్ వచ్చే సమయానికి ఎన్నికల హడావుడి మొదలైంది. ఈయన ఏ శాఖకు సంబంధించిన ఫైళ్లు కూడా పరిశీలించే తీరికలేని పనుల్లో ఉన్నారు. తిత్లీ బిల్లులను ఆయన పరిశీలించే అవకాశం లేదని కలెక్టరేట్ వర్గాల భోగట్టా! అయితే ఏసీ బిల్లుల సృష్టికి కలెక్టరేట్లోని ‘ఎ సెక్షన్’ కేంద్రంగా ఉంది. కానీ అడ్డగోలుగా పాత అ«ధికారుల పేరిట ఈ బిల్లులు పెడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ బిల్లుల కుట్ర వెనుక ఓ జిల్లా ఉన్నతాధికారి హస్తం ఉందనే ఆరోపణలతో కలెక్టరేట్ మార్మోగుతోంది. ఒకవైపు అధికార యంత్రాంగమంతా ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలై ఉంటే మరోవైపు ఈ దొంగ ఏసీ బిల్లులతో ప్రజాధనానికి ఎసరు పెట్టడానికి సిద్ధమవడం గమనార్హం. అలాగే తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను చిత్రీకరించేందుకు అప్పట్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. వీటికి బిల్లులు కూడా అధిక మొత్తంలో ఉండటంతో అప్పటి కలెక్టరు వాటిని సిఫారసు చేసేందుకు నిరాకరించారు. కానీ ఇప్పుడు డ్రోన్ కెమెరాల అద్దె నిమిత్తం రూ.42 లక్షలు చెల్లించేలా కొత్త బిల్లులను తయారుచేసినట్లు తెలిసింది. ఖజానా శాఖలోనే ఆగాలి... సాధారణంగా టీఆర్ 27 ఏసీ బిల్లుల విషయంలో ఖజానా శాఖ అధికారులు జాగ్రత్తగానే ఉంటారు. నిబంధనల ప్రకారం లేనిదే ఏ బిల్లునూ ఆమోదించరనే పేరుంది. ఈ నేపథ్యంలో రూ.3.10 కోట్ల తిత్లీ తుపాను ఏసీ బిల్లులు సోమవారం ఖజానా శాఖకు చేరే అవకాశం ఉంది. మరి వాటిని తిప్పి పంపుతారా? లేదంటే టీడీపీ నాయకులు, సంబంధిత జిల్లా ఉన్నతాధికారి ఒత్తిళ్లకు లొంగి ఆమోదిస్తారా? అనేది వేచిచూడాలి! -
నెల్లూరు జిల్లా- మీ ఓటు ఉందా? చెక్ చేసుకోండిలా....
సాక్షి, నెల్లూరు జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 0861 - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఆర్డీఓ ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవల్ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఆర్డీఓ, ఎమ్మార్వో, బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
కలెక్టరేట్ ఎదుట టీ–మాస్ మహాధర్నా
ఆదిలాబాద్‌అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కా రం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక(టీమాస్) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట టీమాస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి మహిళలు ఖాళీ బిందెలు, గ్యాస్ సిలెండర్లతో భారీ సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మా ట్లాడుతూ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నెల రోజులు సర్వే చేశామన్నారు. బోథ్ నియోజకవర్గంలో 102 గ్రామాల్లో సర్వే చేసి 65 రకాల సమస్యలు గుర్తించినట్లు వివరించారు. 1976లో గుర్తించి పెండింగ్‌లో ఉంచిన గ్రామాలను ఏజెన్సీ గ్రా మాలుగా ప్రకటించాలన్నారు. సర్వే ద్వారా గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని మండలాధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని తెలి పారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాది గూడ, సిరికొండ మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని తెలిపా రు. జిల్లా కేంద్రంలోని వార్డుల్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో డ్వాక్రా గ్రూపులకు అభయహస్తం పథకం కొనసాగించాలని, వడ్డీలేని రుణాలను అన్ని గ్రూపులకు ఇవ్వాలని, ఆదివాసీల పోడుభూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పంట పెట్టుబడి రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీమాస్ జిల్లా కన్వీనర్ బండి దత్తాత్రి, లంక రాఘవులు, దర్శనాల మల్లేష్, అశోక్, పూసం సచిన్, ప్రభాకర్, కిరణ్, గంగన్న, మయూరిఖాన్, వెంకట్, రఘువీర్ యాదవ్, దత్తు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ఫిర్యాదులపై స్పందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్త కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం వందల సంఖ్యలో ప్రజలు మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారని పేర్కొన్నారు. మండల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మాత్రమే కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. సర్వే నెంబరు 1747/10–4లో తనకున్న 39సెంట్ల భూమిని ఆన్లైన్లో నమోదు చేయించాలని వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లెకు చెందిన పద్మావతి కోరారు. – తన భర్త మరణించినందున జీవనం కష్టంగా ఉందని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని దువ్వూరు మండలం సింగసింగనిపల్లెకు చెందిన దస్తగిరమ్మ కోరారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న తాను ఏ పని చేయలేకున్నానని, జీవనాధారం కోసం పెన్షన్ మంజూరు చేయాలని కడప నగరం సంగంపేటకు చెందిన సరోజమ్మ కోరారు. తనకున్న ఎకరా 68 సెంట్ల పొలానికి ఈ–పాస్ పుస్తకం ఇప్పించాలని ఎర్రగుంట్ల మండలం తిప్పలూరుకు చెందిన మహమ్మద్ రఫీ కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్వేత తెవతీయ, ఇన్‌ఛార్జి జేసీ–2 నాగేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తిరగలేక.. బతకలేక...
ఆత్మహత్యలకు కలెక్టరేట్‌ను వేదికగా చేసుకుంటున్న బాధితులు ►కలెక్టరేట్‌కు వచ్చినా పరిష్కారం కాని సమస్యలు ►ప్రజా విజ్ఞప్తులపై స్పందన కరువు ►ప్రహసనంగా దరఖాస్తుల స్వీకరణ ►పరిష్కారంపై అధికారుల మొద్దునిద్ర ►మొక్కుబడి సమీక్షలతో ఫలితం శూన్యం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రజావాణి పేరిట ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సామాన్యుల నుంచి నేరుగా స్వీకరించే వినతుల పరిష్కారం ప్రహసనంగా మారింది. సమస్యల పరిష్కారంపై అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, శాస్త్రీయంగా సమీక్ష జరగక పోవడం సామాన్యులకు ప్రాణ సంకటంగా మారింది. గ్రామ, మండల స్థాయిలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేక సామాన్యులు చివరి ప్ర యత్నంగా ‘ప్రజావాణి’ని వేదికగా ఎంచుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకుని వివిధ అంశాలపై ప్రతి సోమవారం వందలాది మంది కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి జిల్లా అధికారులకు అందజేస్తున్నారు. ప్రజావాణిలోఅందే ప్రతి పిర్యాదునూ క్షుణ్ణంగా పరి శీలించి పరిష్కరించాల్సిన అధికారులు చేతులు దులుపుకుం టున్నారు. తిరిగి మండల స్థాయి అధికారులకే దరఖాస్తులను పంపిస్తున్నారు. దీంతో వందల కిలోమీటర్లు ప్రయాణించి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి లైన్లో నిలుచున్నా పరిష్కారం దొరకడం లేదు. కొన్నిమార్లు అధికారుల నుంచి తిరస్కారం కూడా ఎదురవుతుండడం దరఖాస్తుదారులను మరింత వేదనకు గురి చేస్తోంది. దీంతో కొందరు దరఖాస్తుదారులు ఏకం గా కలెక్టరేట్ సాక్షిగా ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. అరకొరగా సమీక్షలు ప్రజావాణి దరఖాస్తులపై అధికారులతో ప్రతి సోమవారం సాయంత్రం కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ దర ఖాస్తులు పెండింగులో ఉంచడాన్ని అధికారులు సమర్థించుకుంటున్నారు. కలెక్టర్ గట్టిగా మందలించినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజావాణికి స్వయంగా హాజరు కావాల్సిన అధికారులు దరఖాస్తుల స్వీకరణ, కలెక్టర్ సమీక్షకు కూడా కిందిస్థాయి సిబ్బందిని పంపుతున్నారు. కలెక్టరేట్ భవనంపైకి ఎక్కకుండా ఇటీవల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా ఆన్లైన్లోనే విజ్ఞాపనలు స్వీకరిస్తామని కలెక్టర్ శ్రీదేవి ఇటీవల ప్రకటించారు. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఆన్లైన్లో కూడా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. వీటి పరిష్కారం దిశగా శాస్త్రీయ కసరత్తు జరగక సామాన్యులు పాలన యంత్రాంగం తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 250 ప్రభుత్వ విభాగాలు, శాఖలకు సంబంధించి 2548 ఫిర్యాదులు అందగా 696 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆత్మహత్యాయత్నాలిలా... 2014 నవంబరు 3వ తేదీన హజీ గయస్ పీరాసాహెబ్ అనే వృద్ధుడు ఇంటిస్థలం కేటాయింపు విషయంలో అధికారులు సహకరించడం లేదంటూ కలెక్టరేట్ భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని జిల్లా ఆసుపత్రిలో చేర్చి కలెక్టర్ ప్రియదర్శిని స్వయంగా పరామర్శించారు. నాలుగు రోజుల తర్వాత పీరా సాహెబ్ మృతిచెందాడు. మద్దూరు మండలానికి చెందిన దంపతులు భూ సమస్య పరిష్కారం కావడం లేదంటూ పురుగుల మందు డబ్బాతో వచ్చి కలెక్టర్ సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించారు.సోమవారం వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన శ్రీరాములు, చింత లక్ష్మి దంపతులు ఇంటిస్థలం విషయంలో అధికారులు స్పందించడం లేదంటూ ఆత్మహత్యకు యత్నించారు. -
ఆధార్ అనుసంధానం తప్పనిసరి
డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి నెల్లూరు(టౌన్): సంక్షేమ ఫలాలు పేదప్రజలకు అందాలంటే ఆధార్ నంబర్‌ను అనుసంధానించాల్సిందేనని పౌరసరఫరాల శాఖ డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీహాల్లో ఆధార్ సీడింగ్, రేషన్ కార్డుదారుల సమస్యల పరిష్కారానికి ఈపీడీ పద్ధతి అంశాలపై తహశీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఆమె మాట్లాడుతూ గ్యాస్, రేషన్, పింఛన్ ఇలా అన్ని రకాల సబ్సిడీలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అన్నారు. ఇందుకు అధికారులు పక్కాగా చర్యలు చేపట్టి అందరి ఆధార్‌నంబర్‌ను రేషన్ కార్డులతో అనుసంధానం చేయాలన్నారు. రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికి ఎవరూ తహశీల్దార్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. కార్డును బదిలీ చేయించుకోవాలనుకున్నా, ఇతర సభ్యుల పేర్లును చేర్పించుకోవాలన్నా, డూప్లికేట్ కార్డును పొందాలన్నా, తప్పొప్పులను సరిచేసుకోవాలన్నా మీ సేవ కేంద్రాల్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్తగా వచ్చిన ఈపీడీ (ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్) పద్ధతిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ పద్ధతిలో ఉన్న 9 అంశాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తహశీల్దార్లకు అర్థమయ్యే రీతిలో వివరించారు. జేసీ రేఖారాణి మాట్లాడుతూ జిల్లాలో అసలు ఆధార్ కార్డులు పొందని వారు అనేక మంది ఉన్నారన్నారు. త్వరగా వారందరికి కార్డులు తీయించి ఆధార్ నంబర్‌ను అనుసంధానించేదానికి ఇప్పటి వరకు ఆధార్ పొందిన, అనుసంధానించిన వారి జాబితాను ఇవ్వాలని డిప్యూటీ డెరైక్టర్‌ను కోరగా అందుకు ఆమె సమ్మతించారు. డీఎస్ఓ శాంతకుమారి, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ధర్మారెడ్డి, ఏఎస్ఓ శంకరన్ పాల్గొన్నారు.