సాక్షి,సిటీబ్యూరో: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు వెంటనే జిల్లా ఎస్సీ సంక్షేమాధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, విద్యార్థుల దరఖాస్తుల సమర్పించడంలో జరుగుతున్న జాప్యం పై ఆయన సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, వృత్తి విద్య కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులను వసతి గృహ అధికారులు ఈ నెల 28 లోగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ప్రతి షెడ్యూల్ కులాల విద్యార్థిచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామారావు, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు, ఏఎస్‌ఓలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment