ఇంటి యజమాని వేధిస్తున్నాడంటూ.. | married woman has committed suicide over House Owner harassment | Sakshi
Sakshi News home page

ఇంటి యజమాని వేధిస్తున్నాడంటూ..

Published Mon, Nov 7 2016 11:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఇంటి యజమాని వేధిస్తున్నాడంటూ..

ఇంటి యజమాని వేధిస్తున్నాడంటూ..

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమాని వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం ఉదయం కూకట్‌పల్లి మెడికల్ సొసైటీలో చోటుచేసుకుంది. స్థానిక ప్రసన్న కుమార్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో పాలకొల్లుకు చెందిన రామకృష్ణ, సుజాత దంపతులు రెండున్నర సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి మూడు, ఒకటిన్నర సంవత్సరం వయసున్న ఒక బాబు, పాప ఉన్నారు.
 
 
పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ ఓనర్ గొడవపెట్టుకున్నాడని సుజాత బంధువులు చెబుతున్నారు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఓనర్ గొడవకు దిగడంతో మనస్థాపానికి గురైన సుజాత ఇంట్లో ప్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని వారు పోలీసులకు తెలిపారు. కాగా తన చావుకు ఇంటి యజమాని కారణమంటూ ఇంట్లో గోడలు, తలుపులపై రాసి సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement