కూకట్పల్లిలో ఇంటి ఓనర్ వేధింపుల కారణంగా సుజాత ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. సుజాత అద్దెకు ఉన్న ఇంటి యజమాని ప్రసన్న కుమార్ రెడ్డి, స్నేహలత దంపతులపై కూకట్పల్లి పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం వారిద్దరిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు.