owner arrest
-
ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ ఓనర్ అరెస్ట్.. మృతుల్లో తెలంగాణ యువతి
ఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. తాజాగా రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలంలో ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.Delhi's Old Rajendra Nagar coaching centre incident | The owner and coordinator of the coaching centre arrested: Delhi Police— ANI (@ANI) July 28, 2024 చదవండి: Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’‘‘ఈ ఘటనపై పలు సెక్షన్ల కింది రాజేంద్రనగర్ పోలీసు స్టేషనలో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ చేపట్టాం’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎం.హార్షవర్ధన్ తెలిపారు. మృతిచెందినవారిని తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్, తాన్యా సోనిది తెలంగాణ, నవీన్ డాల్విన్ కేరళలోని ఎర్నాకులానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్లో మృతి చెందిన తానీయా సోని స్వస్థలం బీహార్. తానియా సోని తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్నారు. చదవండి: వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదనకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా సికింద్రాబాద్ చేర్చేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్‌లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తిచేయడంలో చొరవతీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు. -
‘సూరత్’ రియల్ హీరో
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న కోచింగ్ సెంటర్లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్ జొరవాడియా అనే యువకుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు. తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ కేతన్ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 22కు చేరుకున్న మృతులు తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఈ విషయమై సూరత్ ఏసీపీ పీఎల్ చౌధరి మాట్లాడుతూ.. మృతుల్లో 18 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారని తెలిపారు. ఓ నాలుగేళ్ల చిన్నారికి కూడా ఈ సందర్భంగా కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువమంది 18 ఏళ్లలోపువారే. కోచింగ్ సెంటర్లో తగిన సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. భవన యజమాని అరెస్ట్.. పలువురు విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్ బుటానిని అరెస్ట్ చేశామని ఏసీపీ పీఎల్ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్ వెకరియా, జిగ్నేశ్ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో ముగ్గురు విద్యార్థులు శనివారం వెలువడ్డ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. యశ్వీ కేవదీయా 67శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, మాన్సీ వర్సని 52 శాతం, హస్థీ సురానీ 69శాతం మార్కులతో పాసయ్యారు’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో అగ్నిప్రమాదాల సందర్భంగా తప్పించుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయమై ఆడిట్ చేపట్టాలని సీఎం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే సూరత్ అగ్నిప్రమాదంపై అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. మృతులకు నివాళులర్పిస్తున్న సూరత్ విద్యార్థినులు -
సుజాత ఆత్మహత్య కేసులో పురోగతి
-
సుజాత కేసులో పురోగతి
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఇంటి ఓనర్ వేధింపుల కారణంగా సుజాత ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. సుజాత అద్దెకు ఉన్న ఇంటి యజమాని ప్రసన్న కుమార్ రెడ్డి, స్నేహలత దంపతులపై కూకట్పల్లి పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం వారిద్దరిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. ఇంటి ఓనర్ తనను తీవ్రంగా వేధించాడని ఇంట్లో పలు చోట్ల రాసి సోమవారం సుజాత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే ఇంటి ఓనర్ ప్రసన్న కుమార్ రెడ్డి పరారయ్యాడు. ఈ ఇంటిలో రెండున్నరేళ్లుగా సుజాత దంపతులు అద్దెకు ఉంటున్నారు. సుజాత పిల్లలు అల్లరి చేస్తున్నారని కొంతకాలంగా ఓనర్ గొడవ పడినట్టు తెలుస్తోంది. సుజాత భర్త ఇంట్లో లేని సమయంలో ఓనర్ ఆమెతో గొడవపడి, అసభ్యంగా మాట్లాడాడని బంధువులు చెప్పారు. సుజాత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.