బైటాయించిన మృతురాలి బంధువులు, (ఇన్‌సెట్‌లో..) సౌజన్యారెడ్డి(ఫైల్)
బోయినపల్లి(చొప్పదండి): అత్తింటి ఆరళ్లకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సౌజన్యారెడ్డి కుమారుడికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబికులు డిమాండ్ చేశారు. మండలంలోని మల్లాపూర్‌లో సౌజన్యారెడ్డి భర్త రాజేందర్‌రెడ్డి ఇంటి ఎదుట శనివారం బైటాయించారు. మండలంలోని శాభాష్‌పల్లికి చెందిన నాయిని బుచ్చిరెడ్డి వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో కుటుంబంతో సహా అద్దెకు ఉంటున్నాడు. ఇతడి పెద్ద కూతరు సౌజన్యారెడ్డి(లహరి)కి బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డితో 16 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లిలో పెద్ద మొత్తంలో కట్న కానుకలు ఇచ్చారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. కొద్ది రోజులు కాపురం సజావుగానే సాగింది.
సౌజన్యారెడ్డి భర్త రాజేందర్‌రెడ్డి, మామ అదనపు కట్నం కోసం వేధించేవారు. అంతేకాకుండా సౌజన్యారెడ్డిని భర్త పుట్టింటిలో వదిలేసి వెళ్లడంతో మానసిక వేదనకు గురైంది. గత నెల 24న తన పుట్టింట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో వరగంల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 6న మృతిచెందింది. సౌజన్యారెడ్డి కుమారుడికి న్యాయం చేయాలంటూ శనివారం సాయంత్రం ఎదుట ధర్నాకు దిగారు. అయితే ఆదే సమయంలో ఆమె భర్త ఇంటికి తాళం వేసి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వేములవాడ రూరల్ సీఐ రఘుచందర్, ఎస్సై ఎన్.వెంకటకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రాత్రి వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment