పిల్లలు లేరని భర్త తిట్టడంతో.. | women con\mmits suicide in ysr district | Sakshi
Sakshi News home page

పిల్లలు లేరని భర్త తిట్టడంతో..

Published Mon, Jul 25 2016 2:45 PM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM

women con\mmits suicide in ysr district

రైల్వేకోడూరు: పిల్లలు పుట్టడం లేదని భర్త తిట్టడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందో భార్య. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరులో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. రైల్వేకోడూరుకు చెందిన మస్తాన్‌కు ఏడేళ్ల క్రితం కె. అలీషా(25)తో వివాహమైంది. జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన మస్తాన్ అప్పుడప్పుడు వచ్చి పోతుండేవాడు. పెళ్లై ఏడు సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోవడంతో.. తరచు దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కువైట్ నుంచి మస్తాన్ ఫోన్‌ చేసి అలీషాను తీవ్రంగా తిట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన అలీషా కువైట్‌లోనే ఉంటున్న తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం రైల్వేకోడూరుకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement