alisha
-
నా స్టూడెంట్ టీచర్ అయింది!
‘ఎక్స్’లో రేవ్ అనే టీచర్ తన స్టూడెంట్ ఆలిషా గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. స్కూల్ రోజుల్లో ఆలీషా అల్లరిపిల్ల. రేవ్ మాటల్లోనే చెప్పాలంటే రెబెల్. ‘ఈ అమ్మాయి భవిష్యత్ ఎలా ఉండబోతుందో’ అంటూ అలీషా గురించి బెంగపడేది రేవ్. కట్ చేస్తే... ఆలిషా ఇప్పుడు ముంబైలోని ఒక స్కూల్లో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్‌కు టీచర్. ‘మొండిఘటం. ఏ పనీ చేయలేదు... అని నా గురించి రేవ్ టీచర్‌కు చెప్పేవారు. అయితే టీచర్ మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేది. అలాంటి ప్రేమను స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్‌కు పంచాలనుకుంటున్నాను’ అంటుంది అలీషా. -
ప్లాన్ ఏంటి?
మహేంద్ర, మమత కులకర్ణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతనదర్శకుడు బి.ఎల్.ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘ప్లానింగ్’. అలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. సాయి గణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించిన ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం పాటలను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విజువల్స్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం మంచి సినిమాలు తీస్తున్నారు. మహేంద్ర చక్కగా నటించారు. రంగసాయి కళాతృష్ణతో సినిమాలు తీస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలు చేయాలి’’ అన్నారు. ‘‘దర్శక–నిర్మాతలు ఎంతో చక్కని ప్లానింగ్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు కొరియోగ్రాఫర్, హీరో మహేంద్ర. ‘‘ఐటమ్ సాంగ్‌తో కెరీర్ ప్రారంభించిన నేను కథానాయిక అయ్యాను. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను’’ అన్నారు మమత కులకర్ణి. ‘‘మాకు వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్‌గారు, స్నేహితులందరికీ ధన్యవాదాలు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్ చేసుకుని స్క్రిప్టును ఫైనలైజ్ చేసి, సినిమా తీశాం’’ అన్నారు రంగసాయి. ఈ వేడుకలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంగీత దర్శకుడు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. ధనుంజయ్, బి. దేవి, నిర్వహణ: బి.భూలక్ష్మి. -
గెస్ట్‌హౌస్‌కు వస్తే నీకు సింగర్‌గా చాన్స్లిస్తా!
సినిమా సంగీత రంగంలో ఇన్ని అపస్వరాలు ఉన్నాయని మీటూ ఉద్యమంతో తేటతెల్లమైంది. ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్. త్రిష అప్‌కమింగ్ సింగర్. కాంపిటీషన్‌కు ముందే ఆమె మీద కన్నేసిన బ్రహ్మానందం గదిలోకి పిలిచి ‘డీల్’ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ‘నువ్వు గెస్ట్‌హౌస్‌కు వస్తే నీకు సింగర్‌గా చాన్స్లిస్తా’ అంటాడు. త్రిష ఒప్పుకోదు. అది కడుపులో పెట్టుకుని కాంపిటీషన్ సమయంలో ఆమె మీద కేకలేస్తాడు. ‘నిన్ను ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటే నువ్వు రావు’ అంటాడు. లైంగికంగా వేధించడం ఒక వేధింపు అయితే పని పరంగా వేధించడం మరో వేధింపు. ఇలా వేధించే సంగీతకారులు హిందీ సినిమా రంగంలో ఉండటం ఒక వర్తమాన వాస్తవం అని మీటూ ఉద్యమం ద్వారా తెలుస్తోంది.‘బాజీగర్’ సినిమాలోని ‘ఏ కాలీ కాలీ ఆంఖే’ వంటి పెద్ద హిట్ పాటలిచ్చిన అనూ మలిక్‌పై మీటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బప్పీలహరి ప్రభ ముగిశాక బాలీవుడ్లో వెలిగిన సంగీత దర్శకుల్లో అనూ మలిక్ ఒకడు. ‘బోర్డర్’, ‘ఇష్క్’, ‘మై హూ నా’ వంటి చాలా సినిమాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అతడి దృష్టిలో పడితే సింగర్‌గా మంచి కెరీర్ దక్కుతుందని కొత్త సింగర్లు ఆశిస్తారు. ఆ ఆశనే అతడు అవకాశంగా మలుచుకున్నాడని మీటూ ఆరోపణల వల్ల తెలుస్తున్నది. గాయనులు శ్వేతా పండిట్, సోనా మహాపాత్ర అతనిలోని కీచక స్వరాన్ని లోకానికి చాటారు. ‘2000 సంవత్సరంలో నాకు పాట ఇస్తానని స్టూడియోకి పిలిచి రికార్డింగ్ రూమ్‌లో హఠాత్తుగా నన్ను ముద్దు పెట్టమన్నాడు. అప్పుడు నాకు 15 ఏళ్లు కూడా లేవు. ఏమీ తెలియదు. కానీ అతడి పెదాల మీద పూసిన విషపు నవ్వుని చూసి భయంతో వణికిపోయాను. మా అమ్మకు కూడా ఈ విషయం చెప్పక ఇంటికి రాగానే దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను’ అని శ్వేతా పండిట్ చెప్పింది. మరో గాయని సోనా మహాపాత్ర అయితే ‘అతడు నాతో ప్రదర్శించిన వైఖరిలోనే లైంగిక చొరబాటు ఉంది’ అని చెప్పింది. ఇప్పుడు తాజాగా మరో గాయని కారలిసా మంటేరో ఈ ఇద్దరితో జత కలిసి అనూను తప్పు పట్టింది. ‘అతడు నన్ను ఊరికూరికే ఇంటికి రమ్మని ఇబ్బంది పెట్టేవాడు. పాట ఏదైనా ఉంటే రికార్డింగ్ స్టూడియోలోనే కలుస్తాను. ఇంట్లో కలవను అని చెప్పేదాన్ని. అప్పటికీ ఒకసారి వెళ్లాల్సి వస్తే నా స్నేహితుణ్ణి తీసుకుని వెళ్లాను’ అని చెప్పిందామె. తెలిసిన గాయనుల అనుభవాలు ఇలా ఉండగా అంతగా వృద్ధిలోకి రాకపోయినా అనూతో హడలెత్తించే అనుభవాలున్న మరో ఇద్దరు గాయనులు కూడా పత్రికలలో తమ పేర్లు ప్రస్తావించకుండా అనూ చేసిన దౌష్ట్యాలు చెప్పుకొచ్చారు. ‘అతడు నన్ను ఇంటికి పిలిచాడు. ఇంట్లో ఎవరూ లేరని అక్కడకు వెళ్లాక తెలిసింది. అతడు నన్ను దాదాపు రేప్ చేయబోయాడు. ఈలోపు బెల్ మోగడంతో బతికిపోయాను. ఆ తర్వాత నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్న నెపంతో దారిలో తప్పుగా వ్యవహరించాడు. దారి మధ్యలో కారు ఆపి బలవంతం చేశాడు’ అని ఒక సింగర్ చెప్పగా మరో సింగర్ ‘రికార్డింగ్ రూమ్‌లో అతడు నా ఒళ్లంతా తడిమేశాడు’ అని చెప్పింది. అనూ మలిక్ మీద వచ్చిన ఆరోపణల దుమారానికి అతడు ఇండియన్ ఐడల్ జడ్జి పదవి నుంచి తప్పుకున్నాడు. లాయర్ ద్వారా ఈ ఆరోపణలన్నీ అభాండాలు అని చెప్పిస్తున్నాడు. కానీ అనూ మలిక్ అలాంటి వాడేనని అతని మీద వచ్చిన అభియోగాల్లో ప్రతి అక్షరం సత్యమే అయ్యే అవకాశం ఉందని సీనియర్ గాయనీమణి అలీషా చినాయ్ ప్రకటన చేసింది. రెండు దశాబ్దాల క్రితం అనూ మలిక్ తనతో చెడుగా వ్యవహరించాడని కోర్టులో కేసు వేసిన అలీషా అతడి అసలు రూపాన్ని లోకానికి వెల్లడి చేసే ప్రయత్నం చేసింది. ఆ కేసును అనూ మలిక్ ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాడు. అలీషా, అనూ కలిసి పని చేశారు కూడా. అయినప్పటికీ ఆ పాత గాయాన్ని ఆమె మర్చిపోలేదు. తాజా ఆరోపణల నేపథ్యంలో తనూ గొంతు కలిపింది. ‘ఆ రోజుల్లో నేను ఒక్కదాన్నే పోరాడాను. ఇవాళ చాలామంది కలిసి పోరాడుతున్నారు’ అని అందామె. ‘గాయపడినవాళ్లకే ఆ గాయం తాలూకు నొప్పి తెలుస్తుంది’ అని కూడా అంది. లైంగిక చొరబాటుకు, చెడు వర్తనకు ఏవో ఏకాంత ప్రదేశాలు, హోటల్ రూములు అక్కర్లేదని ఇల్లే పెద్ద ప్రమాదకరమైన ప్రదేశం అని అనూ మలిక్ ఉదంతం ద్వారా తెలుస్తోంది. అనూ మలిక్ స్త్రీలను ఇబ్బంది పెట్టేందుకు తన ఇంటినే ఎక్కువగా ఎంచుకున్నాడు. కుటుంబీకులు ఇంట్లో ఉన్నా లేకపోయినా అతడు కొత్త అమ్మాయిలతో చెడుగా వ్యవహరించడానికి తెగించేవాడని ఉదంతాలు చెబుతున్నాయి.మరోవైపు గాయకుడు కైలాష్ ఖేర్ మీద కూడా ఇలాంటి ప్రవర్తన గురించి ఫిర్యాదులు వచ్చాయి. గాయని సోనా మహాపాత్ర, గాయని వర్షా సింగ్ అతని వైఖరి అభ్యంతరకరం అని ప్రకటనలు చేశారు. హిందీ సినిమా సంగీతంలో గొప్ప గొప్ప సంగీతకారులు, గాయకులు ఉన్నారు. హిందీ సినిమా సంగీతం పట్ల కోట్లాదిమంది అభిమానులకు గౌరవం, ప్రేమా ఉన్నాయి. అలాంటిది ఆ రంగంలో ఇలాంటి స్వరముఖ వ్యాఘ్రాలు ఉండటం వాంఛనీయం కాదు.మీటూ చాలా వాటిని కరెక్ట్ చేస్తోంది. సినిమా రంగాన్ని తగిన స్వరంలో పెడుతుందని ఆశిద్దాం. -
ఈ దేశం మనది!
‘‘మన సమస్యలను మనమే పరిష్కరించు కోవాలి. సమాజంలోని అందరూ ఈ దేశం మనది అనే భావనతో ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘పార్శిల్’ చిత్రం ఫేం సిరాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీ సత్యనారాయణ నిర్మించారు. అలీషా కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సిరాజ్ దర్శకత్వం వహించ డంతో పాటు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘యాక్షన్ కలగలసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని సిరాజ్ పేర్కొన్నారు. -
పిల్లలు లేరని భర్త తిట్టడంతో..
రైల్వేకోడూరు: పిల్లలు పుట్టడం లేదని భర్త తిట్టడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందో భార్య. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరులో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. రైల్వేకోడూరుకు చెందిన మస్తాన్‌కు ఏడేళ్ల క్రితం కె. అలీషా(25)తో వివాహమైంది. జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన మస్తాన్ అప్పుడప్పుడు వచ్చి పోతుండేవాడు. పెళ్లై ఏడు సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోవడంతో.. తరచు దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కువైట్ నుంచి మస్తాన్ ఫోన్ చేసి అలీషాను తీవ్రంగా తిట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన అలీషా కువైట్‌లోనే ఉంటున్న తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం రైల్వేకోడూరుకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలీవుడ్ బ్యూటి సాహసాలు
తన ఇద్దరు కూతుళ్లతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటి సుస్మితా సేన్. కొంత కాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద డైనమిక్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న ఈ విశ్వ సుందరి, రియల్ లైఫ్‌లోనూ తాను సాహసినే అంటూ ప్రూవ్ చేసుకుంది. తన కూతుళ్లు రినీ, అలీషాలతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సుస్మితా పులితో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సుస్మిత మాత్రమే కాదు తన కూతుళ్లు కూడా ఆ పులితో ఫోటోలు దిగటం విశేషం. ప్రస్తుతం హ్యాపి యానివర్సరీతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సుస్మితా సేన్, ఎక్కువ సమయం తన పిల్లలతో గడిపేందుకు వరుసగా సినిమాలు అంగీకరించటం లేదంది. Big one on my #bucketlist #tick -
ఆమె ట్రాన్స్‌జెండర్ అయినందున..
పెషావర్: పాకిస్తాన్లో ఓ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ జీవితం డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైపోయింది. దుండగుల దాడిలో శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగిన పరిస్థితుల్లో ఉన్న ఆమెను.. ట్రాన్స్‌జెండర్ కావడం వలన పురుష వార్డులో ఉంచాలా లేక మహిళా వార్డులో ఉంచాలా అనే సందేహంతో డాక్టర్లు సుమారు నాలుగు గంటలు చికిత్స మొదలుపెట్టలేదు. దీంతో కీలక సమయంలో వైద్యం అందకపోవడం వలనే ఆమె మృతి చెందిందని తోటి ట్రాన్స్ జెండర్లు ఆరోపిస్తున్నారు. ఖైబర్- పఖ్తున్ఖ్వ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ అలీషాపై ఆదివారం రాత్రి కొందరు దుండగులు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ట్రాన్స్జెండర్ల హక్కులకై పోరాడుతున్న అలీషా వ్యవహారం నచ్చకే సాంప్రదాయకవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అలీషాను పెషావర్‌లోని 'లేడీ రీడింగ్ హస్పిటల్'కు తరలించారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అలీషాకు ట్రీట్మెంట్ చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అంతేకాదు ఆ సమయంలో అలీషా స్నేహితులతో హాస్పిటల్ సిబ్బంది అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపనలున్నాయి. మృతి చెందడానికి ముందు సమాజంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ట్రాన్స్జెండర్లను ప్రభుత్వం ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరింది.