
మౌనిక మృతదేహం
ములకలపల్లి : మండలంలోని మూకమామిడి గ్రామంలో శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... మూకమామిడి గ్రామస్తురాలు సున్నం మౌనిక(18), ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది. ఖమ్మానికి చెందిన గణేష్, పాల్వంచలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
రెండు నెలల క్రితం ఫోన్ ద్వారా మౌనికకు పరిచయమయ్యాడు. ప్రేమించానని, పెళ్లాడతానని ఆమెను అతడు నమ్మించి మోసగించాడు. ఇది భరించలేని మౌనిక, శుక్రవారం తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి సుజాత ఫిర్యాదుతో కేసును ఎస్సై ఉదయ్‌కిరణ్ నమోదు చేశారు, దర్యాప్తు జరుపుతున్నారు.