
సాక్షి, ఖమ్మం: ప్రేమ విఫలం అయిందని ఒకరు.. పెద్దలు మందలించారని మరొకరు.. ఉద్యోగం లేదని ఇంకొకరు.. పరీక్షలో ఫెయిల్ అయ్యామని మరికొందరు.. ఇలా ఏదో ఒక కారణంతో నిత్యం సమాజంలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలకు నిండా నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా చిదిమేస్తున్నారు. జీవితంపై భరోసా లేకపోవడంతో నిరాశలో కూరుకుపోయి.. ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. తమ తల్లిదండ్రులు, అయినవారు, ఆప్తులు పెట్టుకున్న ఆశల్ని చిదిమేసి.. అకస్మాత్తుగా తనువు చాలిస్తున్నారు. సమాజంలో పెరిగిపోతున్న ఆత్మహత్యలపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణం ఎన్‌టీఆర్ నగర్‌లో ఓ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలమర్తి చిన్న(24) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని తనువు చాలించాడు. ప్రేమ విఫలం కావటం వల్లనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment