
లక్ష్మి మృతదేహం
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని కుమ్మరికుంటకు అనుబంధ గ్రామమైన గొల్లపల్లికి చెందిన తమ్మడవేని లక్ష్మి(32) భర్త,అత్త,మామ, బావల వేధింపులతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పాలకుర్తి మండలం పూట్నురుకు చెందిన లక్ష్మికి 16ఏళ్ల క్రితం గొల్లపల్లికి చెందిన రాజుతో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కొడుకు, 11 ఏళ్ల కూతురు ఉంది. లక్ష్మి మాజీ ఉపసర్పంచ్.
ఇంటిపని విషయమై లక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు తరుచూ వేధించేవారు. అనేకసార్లు గొడవలతో పంచాయితీలు జరిగాయి. ఇదే విషయమై ఈ నెల 7న లక్ష్మిని భర్త రాజు కొట్టాడు. ఇంట్లో నుంచి పోయిన లక్ష్మి ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారంఉదయం గాలించగా మృతదేహం లభ్యమైంది. భర్త రాజు, బావ కొంరయ్య, అత్త గట్టమ్మ, మామ పోచాలుల వేధింపులతోనే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మేనమామ కాల్వ మల్లయ్య చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.