బనశంకరి : ప్రేమించి పెళ్లి చేసుకుని బుద్ధిగా నడుచుకోవాల్సిన భర్త, భార్యను తీవ్రంగా గాయపరిచిన సంఘటన నగరంలో శుక్రవారం ఆలస్యంగా వెలుచూసింది. వివరాలు...యాదగిరి తాలూకా వక్కనళ్లి గ్రామానికి చెందిన వివాహిత తిమ్మవ్వ (40) భర్తకు దూరంగా ఉంటోంది. పశువులు మేతకు వెళ్లే సమయంలో అదే జిఆల్ల కోయలూరుకు చెందిన దేవప్ప (35)తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వయసులో పెద్దది కావడంతో దేవప్ప కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినా కూడా పెద్దలను ఎదిరించి ఇద్దరు వివాహం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బతకుదెరువు కోసం ఇద్దరు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుని కూలి పనులకు వెళ్తున్నారు. వీరితో పాటు దేవప్ప తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఇదిలా ఉంటే జనవరి 1 నుంచి తిమ్మవ్వను నిర్భందించి ఆమె సున్నిత భాగాల్లో తీవ్రంగా గాయపరిచారు. చివరకు ఆమెను తగులబెట్టడానికి దేవప్ప యత్నించాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను యాదగిరికి తరలించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment