![Women Attempt Suicide With Two Children In Shamirpet - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/20/kids-suicide.jpg.webp?itok=TzWFDqF-)
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహ విషమిచ్చి తల్లి ఆత్మహత్యయత్నం చేసింది. దురదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి ప్రీతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా అనాధ అయిన ప్రీతి వరంగల్ అనాధాశ్రయంలో పెరిగింది. ఆరు సంవత్సరాల క్రితం గోపినాధ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. గోపీనాథ్ ప్రీతి దంపతులు షామీర్ పేటలోని మజీద్ పూర్‌లో గత కొంత కాలంగా జీవనం కొనసాగిస్తున్నారు. పెళ్ళైన కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె తరచు అనాధ ఆశ్రమానికి వెళ్ళేది. (వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో..! )
అనంతరం పెద్దలు నచ్చజెప్పడంతో గోపినాథ్ వద్దకు ప్రీతి తిరిగి వచ్చింది. అయినప్పటికీ ప్రీతికి వేధింపులు ఎక్కువవడంతో గత్యంతరం లేక పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీనితో తల్లి బిడ్డలను చికిత్సా నిమిత్తం మేడ్చల్లోని లీలా ఆసుపత్రిలోచేర్చగా..చికిత్సా పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి ప్రీతి పరిస్థితి విషమంగా ఉంందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (అర్థరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై రాకపోకలు)
Comments
Please login to add a commentAdd a comment