
9లో ప్రేమ విఫలం.. బలవన్మరణం
పట్టుమని 15 ఏళ్లు కూడా నిండకనే ప్రేమలో పడ్డాడు. ఇష్టపడిన బాలికకు తాను పంపిన బహుమతి నిరాకరించిందని మనస్తాపానికి గురయ్యాడు.
ములకలచెరువు: పట్టుమని 15 ఏళ్లు కూడా నిండకనే ప్రేమలో పడ్డాడు. ఇష్టపడిన బాలికకు తాను పంపిన బహుమతి నిరాకరించిందని మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ములకలచెరువు హాస్టల్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగుట్టకు చెందిన బాలుడు జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఒక బాలికను ప్రేమించాడు. బాలిక అతడి ప్రేమను తిరస్కరించడంతో మంగళవారం అర్ధరాత్రి హాస్టల్‌లో గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హాస్టల్ సిబ్బంది గమనించి అతడిని 108లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై హాస్టల్ ఇన్‌చార్జ్ వార్డెన్ హరిబాబు వివరణ కోరగా.. ఆత్మహత్యకు యత్నించిన బాలుడు హాస్టల్‌లో ఉండడానికి దరఖాస్తు మాత్రమే చేసుకున్నాడని, అనుమతి ఇవ్వనప్పటికీ హాస్టల్‌లో ఉంటున్నాడని పేర్కొన్నారు. సంఘటనపై ఉన్నతస్థాయి అధికారులు సమాచారం చేరవేశామని వార్డెన్ చెప్పకొచ్చారు.