
ముక్కంటి సేవలో శ్రీనివాసన్
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. ఆలయాధికారులు ఆయనను శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
బీసీసీఐది ద్వంద్వ వైఖరి: సుబ్రతో రాయ్
ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయంలో బీసీసీఐ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సహారా ఇండియా చైర్మన్ సుబ్రతో రాయ్ ధ్వజమెత్తారు. లీగ్ నుంచి తమ పుణే వారియర్స్ జట్టును తొలగించడంతో తాను దగా పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.