
జ్ఞాన సముపార్జన కోసమే విద్య
ఎస్వీయూ స్నాతకోత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్య
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ‘చదువు.. డిగ్రీల కోసమో, సంపాదనకో, ఉద్యోగం సాధించడానికో కాదు. జ్ఞాన సముపార్జన కోస మే. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన వెంకయ్య మాట్లాడుతూ దేశాభివృద్ధి గురించి రాజకీయాలకతీతంగా ఆలోచించాలని యువతకు పిలుపునిచ్చారు.
ఏపీ, తెలంగాణ ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు ఉపాధి పొం దలేక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘మనం శాస్త్ర, పరిశోధనల్లో వెనుకంజలో ఉన్నాం. మంచి ఆలోచనలు, క్రమశిక్షణతో శ్రమపడితే విజయం తథ్యం.’ అని చెప్పారు.
విద్యలో నాణ్యత పెరగాలి: గవర్నర్
ఉన్నతవిద్యలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఇష్టారాజ్యంగా కళాశాలలకు అనుమతివ్వడం వల్ల ఉన్నత విద్యలో నాణ్యత పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాగా, కేంద్ర మంత్రి వెంకయ్య ప్రసంగిస్తున్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేశారు.