
ఎస్వీయూలో వెంకయ్యకు చేదు అనుభవం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తొలుత పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేసిన వెంకయ్య నాయుడు అనంతరం ప్రసంగించేందుకు సిద్ధమైయ్యారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై నిరసన కార్యక్రమం చేపట్టారు.
వెంకయ్య ప్రసంగం ఆరంభం కాగానే ప్లకార్డులతో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఏమైందంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపుతప్పడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.