జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
పీలేరు, న్యూస్‌లైన్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యమని, అందరూ సమష్టిగా పని చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పీలేరు, కేవీపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్సార్ సీపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.
తెలుగు కాంగ్రెస్ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్‌సీపీకి ఘన విజయం చేకూర్చేందుకు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి మహానేత రుణం తీర్చుకోవాలని కోరారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం కరువు, కాటకాలతో తల్లడిల్లిందని, కిరణ్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరోగమనంలో పయనించాయని విమర్శించారు.
చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు రాజకీయాలతో తెలుగు జాతిని ముక్కలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, కిరణ్ పార్టీలకు ఓటడిగే నైతిక హక్కు లేదన్నారు. కిరణ్ ఇలాకాలో పర్యటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.
ఈ పర్యటనలో రాజంపేట పార్లమెంటరీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.వెంకట్రమణారెడ్డి, ఎం.రెడ్డిబాషా, హరీశ్వర్‌రెడ్డి, నారే వెంకట్రమణారెడ్డి, వెంకటసిద్ధులు, భానుప్రకాష్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, ఉదయ్‌కుమార్, షామియానా షఫీ, బీడీ.నారాయణరెడ్డి, ఎం.రవీంద్రనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఆదినారాయణ, పెద్ద సిద్దయ్య, ద్వారకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోనియా తొత్తు కిరణ్: పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
సమైక్య ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీ తొత్తు అని వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన పీలేరు, కేవీపల్లె మండలాల్లో విస్తృతంగా పర్యటిం చారు.
కేవీపల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారకులైన చంద్రబాబు, కిరణ్‌కు ఈ ఎన్నికల్లో ఓటడిగే నైతిక హక్కు లేదన్నారు. సమైక్య ముసుగులో కొత్త పార్టీని తెరపైకి తీసుకురావడం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల్లో భాగమేనని దుయ్యబట్టారు.
కొత్త పార్టీకి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. వైఎస్సార్ సీపీని దెబ్బతీయడానికి టీడీపీ, కాంగ్రెస్, కిరణ్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయ ని ఆరోపించారు. ప్రజల అండదండలు, ఆశీర్వాదంతో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.