'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి' | Gattu Ramachandra rao takes on TDP MP Maganti babu | Sakshi
Sakshi News home page

'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి'

Published Fri, Sep 19 2014 1:38 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM

'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి' - Sakshi

'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి'

హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావుపై దాడి చేసిన ఏలూరు ఎంపీ మాగంటి బాబును వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణలోని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో గట్టు రామచంద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మాగంటి బాబు ఆయన గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు నీకేమైనా ఓటు వేశారా అని మాగంటి బాబును గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే దాడిపై తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్రా సీఎం, గవర్నర్ను కలవనున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని గట్టు ఆరోపించారు.

అయితే తాటి వెంకటేశ్వరరావుపై దాడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు ఖండించారు. శుక్రవారం తాటి వెంకటేశ్వరరావుకు హరీష్ రావు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి గల కారణాలను హరీష్ రావు ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement