
కాంగ్రెస్ ది కుంభకోణాల చరిత్ర: గట్టు
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, కుతంత్రాల చరిత్ర వున్న టీడీపీలకు టీఆర్‌ఎస్, ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రజలంతా రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటుంటే కాంగ్రెస్, టీడీపీలకు మింగుడుపడటం లేదని శుక్రవారం విమర్శించారు. కేసీఆర్ దీక్షను విమర్శించడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చూస్తు న్న చంద్రబాబు కుట్రలకు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రతిరూపమన్నారు. ప్రజల మద్దతు లేక, కార్యకర్తలు వెంట రాక నిరాశతో, మతిభ్రమించి కాంగ్రెస్, టీడీపీ తిక్కతిక్కగా మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు.