
'జైరాంకు జుట్టు పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదు'
హైదరాబాద్: జైరాం రమేష్‌కు జుట్టు పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. కోళ్ల ఫాం నుంచి వచ్చిన కోడిపిల్ల లాంటి వాడని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడికే విషయాలు తెలుస్తాయన్నారు. జైరాం రమేష్కు పదవి వైఎస్‌ఆర్ తోడ్పాటుతో తెలుగుజాతి పెట్టిన భిక్ష అని అన్నారు.
రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కేసు ఉన్న విషయం జైరాం రమేష్ మరిచాడా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఎందుకు జైలుకు వెళ్లారో జైరాంకు తెలియదా అని అడిగారు. జైరాం రమేష్, చంద్రబాబు కలిసి పన్నిన కుట్రలో భాగంగానే వైఎస్ జగన్ జైలుకు వెళ్లారని ఆరోపించారు. వైఎస్ఆర్ పేరు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పెట్టినప్పుడు జైరాం రమేష్ ఎక్కడున్నాడని గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు.