
'సింగపూర్‌కు బిషాణ ఎత్తేయడానికి బాబు రెడీ'
సీమాంధ్రలో తమ భారీ మెజారిటీ ఖాయమని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు.
హైదరాబాద్: సీమాంధ్రలో తమ భారీ మెజారిటీ ఖాయమని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలోనూ వైఎస్‌ఆర్ సీపీ కింగ్ మేకర్‌గా అవతరిస్తుందని చెప్పారు. టీడీపీ-బీజేపీ మాయాకూటమి కుతంత్రాలు ఎన్నికల్లో పనిచేయలేదన్నారు. సీమాంధ్రలో 80 శాతం అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాలను YSRCP కైవసం చేసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఎన్నికలు ఏకపక్షంగా సాగాయన్నారు.
దుష్టచతుష్టయం చంద్రబాబు, వెంకయ్య, పవన్, ఎల్లో మీడియా కుట్రలు ఏమాత్రం పనిచేదన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు కొలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయన్నారు. జేఎస్పీ.. టీడీపీకి బినామి సంస్థ అని ఆరోపించారు. పక్కవారి కోసమే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే బాటలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత వల్ల మోడీ హవా రాష్ట్రంలో ఉండదని అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా చంద్రబాబు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. చంద్రబాబు ఈ ఓటమితో హ్యట్రిక్ కొట్టబొతున్నారని పేర్కొన్నారు. సింగపూర్‌కు బిషాణ ఎత్తేయడానికి బాబు రెడీ అయ్యారన్నారు. బెట్టింగ్ బిజినెస్ కోసమే లగడపాటి సర్వేలు చేస్తున్నారని ఆరోపించారు. మే 16 తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించరని చెప్పారు. పథకం ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు.