టీడీపీ ఉపశమనానికే పనికొస్తాయి : గట్టు | Ysr congress party will win in General elections, says Gattu Ramachandra rao | Sakshi
Sakshi News home page

టీడీపీ ఉపశమనానికే పనికొస్తాయి : గట్టు

Published Tue, May 13 2014 12:52 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

టీడీపీ ఉపశమనానికే పనికొస్తాయి : గట్టు - Sakshi

టీడీపీ ఉపశమనానికే పనికొస్తాయి : గట్టు

మున్సిపోల్స్ 20శాతం ఓటర్లకు సంబంధించినవే   
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం:గట్టు

 
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఎటూ ఓడిపోతామని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నాలుగురోజుల పాటు ఉపశమనం పొందడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పనికి వస్తారుు తప్ప అంతకుమిం చిన ప్రభావం ఏమీ ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ నెల 16వ తేదీన వెల్లడయ్యే శాసనసభ, లోక్‌సభ ఫలితాల్లో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవని గట్టు సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఇవి తాము ఊహించని ఫలితాలేమీ కాదని, ఐదారు మున్సిపాలిటీలు అదనంగా వస్తాయనుకున్నాము కానీ రాలేదని అన్నారు. టీడీపీ మున్సిపల్ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుని డబ్బు విపరీతంగా కుమ్మరించిందని అందుకే ఎక్కువ సీట్లు పొందగలిగిందని చెప్పారు.
 
  పైగా ఈ ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రి కావాలా...వద్దా? అనే అంశంపై జరిగినవి కావని, అలాగే టీడీపీ వాళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓట్లడిగిన ఎన్నికలు కావన్నారు. తాము గెల్చుకున్న మున్సిపాలిటీలన్నీ కొత్తగా టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి గెల్చుకున్నవిగా మీడియా గుర్తించాలని కోరారు. ఇవి కేవలం 90 నియోజకవర్గాల పరిధిలోని 20శాతం ఓటర్లకు సంబంధించిన ఫలితాలేనని.. పేద, బడుగు, బలహీన, మైనారిటీవర్గాల వారు 80 శాతం మంది గ్రామీణ ఓటర్లలో ఉన్నారని వివరించారు. 2006లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి ఎంపీటీసీల్లో 38 శాతం ఓట్లు వస్తే జెడ్పీటీసీలకు వచ్చేసరికి 31 శాతానికి పడిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీల్లో 51 శాతం ఓట్లు వస్తే జెడ్పీటీసీలకు వచ్చేటప్పటికి 61 శాతానికి పెరిగాయని తెలిపారు.
 
 ఒకే ఎన్నికల్లో రెండు పదవులకు పోలైన ఓట్ల వ్యత్యాసం 10 శాతం ఉండటం గమనించాల్సిన విషయమన్నారు. అసలివి అంత పరిగణనలోకి తీసుకోవాల్సిన ఎన్నికలే కావని, మున్సిపల్ ఎన్నికల తరువాత మోడీ, పవన్‌కళ్యాణ్ విషయంలో సీమాంధ్రలో వచ్చిన వ్యతిరేకత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి బాగా లాభం చేకూరుస్తుందని తెలిపారు. సీమాం ధ్రను విభజించిందే బీజేపీ అన్న భావన ప్రజల్లో ఉందన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు వైఎస్సార్‌సీపీకి ఎందుకు దూరమయ్యారనేది తాము విశ్లేషించుకుంటామని గట్టు చెప్పారు. సంస్థాగతంగా వైఎస్సార్‌సీపీ ఇంకా బలపడాల్సి ఉందన్న వాస్తవాన్ని కూడా గ్రహించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యతపై సంబరాలు జరుపుకుంటున్న వారికి కూడా శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందనే విషయం తెలుసునని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement