seemandhra election
-
ఎన్నికల్లో గెల్చినోళ్లు ఇంటికెళ్లి ఏడుస్తారు: డొక్కా
హైదరాబాద్: సీమాంధ్ర ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గెలిచిన వారు ఇంటికెళ్లి ఏడుస్తారు, ఓడినవారు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏడుస్తారని వెల్లడించారు. డబ్బులు పంచిన కొందరు అభ్యర్థులు రాజకీయంగా, మానసికంగా, ఆర్థికం దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో చంద్రబాబు, నరేంద్ర మోడీలపై వ్యతిరేకత బలంగా ఉందని.. ఈ ఓట్లు వైఎస్ఆర్ సీపీకి వెళ్తే ఆ పార్టీ గెలుస్తుందని వరప్రసాద్ విశ్లేషించారు. -
'పశ్చిమ'లో 15 అసెంబ్లీ స్థానాలు మావే: వంకా
నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పార్టీ రెండు లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్ దీమా వ్యక్తం చేశారు. జిల్లాల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లంక గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామిచ్చారు. తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభ్యున్నతికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తారని చెప్పారు. నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వైఎస్ఆర్ సీపీ ద్వారానే సాధ్యమన్నారు. -
'సింగపూర్‌కు బిషాణ ఎత్తేయడానికి బాబు రెడీ'
హైదరాబాద్: సీమాంధ్రలో తమ భారీ మెజారిటీ ఖాయమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలోనూ వైఎస్ఆర్ సీపీ కింగ్ మేకర్‌గా అవతరిస్తుందని చెప్పారు. టీడీపీ-బీజేపీ మాయాకూటమి కుతంత్రాలు ఎన్నికల్లో పనిచేయలేదన్నారు. సీమాంధ్రలో 80 శాతం అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాలను YSRCP కైవసం చేసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఎన్నికలు ఏకపక్షంగా సాగాయన్నారు. దుష్టచతుష్టయం చంద్రబాబు, వెంకయ్య, పవన్, ఎల్లో మీడియా కుట్రలు ఏమాత్రం పనిచేదన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు కొలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయన్నారు. జేఎస్పీ.. టీడీపీకి బినామి సంస్థ అని ఆరోపించారు. పక్కవారి కోసమే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే బాటలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత వల్ల మోడీ హవా రాష్ట్రంలో ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా చంద్రబాబు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. చంద్రబాబు ఈ ఓటమితో హ్యట్రిక్ కొట్టబొతున్నారని పేర్కొన్నారు. సింగపూర్‌కు బిషాణ ఎత్తేయడానికి బాబు రెడీ అయ్యారన్నారు. బెట్టింగ్ బిజినెస్ కోసమే లగడపాటి సర్వేలు చేస్తున్నారని ఆరోపించారు. మే 16 తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించరని చెప్పారు. పథకం ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు. -
దళితులపై తెగబడ్డ తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు: సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ ముగిసినా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు. తమకు ఓటు వేయని వారిపై దాడులకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లాలో మూడు గ్రామాల్లో దళితులపై టీడీపీ కార్యకర్తల దాడులకు పాల్పడ్డారు. గంగాధర నెల్లూరు మండలం పాచిగుంటలో మహిళలతో సహా పలువురిపై దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తల దాడితో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. 20 మంది మహిళలు గాయపడ్డారు. అంబోదారిపల్లెలోనూ టీడీపీ కార్యకర్తలు తెగబడ్డారు. ఈ ఘటనలో సురేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆముదాలలో తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులను భయభ్రాంతులకు గురి చేశారు. -
హ్యాట్రిక్ ఓటమి తప్పదా?
హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు విడుదలకు ముందే చంద్రబాబు నాయుడు ఓటమి అంగీకరించారా అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలింగ్ సరళి పరిశీలించిన తర్వాత టీడీపీ అధినేతకు దిగులుపట్టుకున్నట్టు కనబడుతోంది. సీమాంధ్రలో 'సీలింగ్ ఫ్యాన్' ప్రభంజనం ఖాయమని నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి స్పష్టం చేస్తోందన్న వార్తల నేపథ్యంలో 'సైకిల్' నాయకుడు నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. 'హ్యాట్రిక్ ఓటమి' తప్పదన్న భావన చంద్రబాబులో కనిపిస్తోంది. మూడో ఓటమిని తప్పించుకునేందుకు 'నమో' జపం చేసినా, 'పవన్' దండకం వల్లించినా ప్రయోజనం లేకపోయిందన్న వ్యక్తమయింది. పోలింగ్ ముగిసిన దాదాపు గంట తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు తమ పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్పలేకపోయారు. పైపెచ్చు ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు. పోలింగ్ మరుసటి రోజు మళ్లీ విలేకరుల సమావేశం పెట్టి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటమి భయంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. పోలింగ్ సరళి చూసిన తర్వాత అధినేత చంద్రబాబే జావగారిపోవడంతో తెలుగు తమ్ముళ్లు మరింత నిరుత్సాహానికి గురయ్యారు.