కాంగ్రెస్‌ను వీడినవారంతా డిఫాల్టర్లే: జైరాం | removing persons of congress are black list contractors, says jairam ramesh | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడినవారంతా డిఫాల్టర్లే: జైరాం

Published Sun, May 4 2014 12:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

removing persons of congress are black list contractors, says jairam ramesh

అనంతపురం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారంతా బ్లాక్‌లిస్ట్ కాంట్రాక్టర్లు, బ్యాంకు రుణం ఎగవేసిన డిఫాల్టర్లని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ పేర్కొన్నారు. శనివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు బయటికి వెళ్లిన రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావులు బ్లాక్ లిస్ట్ కాంట్రాక్టర్లంటూ అభివర్ణించారు.

 

వారంతా బ్యాంకుల నుంచి రుణం పొంది ఎగవేసిన డిఫాల్టర్లన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ  మతవాదానికి మద్దతిచ్చిందని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement