కొత్త సీమాంధ్ర రాష్ట్రంలో 25 జిల్లాలు: జైరాం
కాంగ్రెస్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేశారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు లాంటి నాయకులు అక్రమంగా వేలకోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు.
సీమాంధ్ర ప్రాంతానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 48 టీఎంసీల జలాలు కేటాయిస్తామని, అలాగే కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలను 25 కు పెంచుతామని ఆయన చెప్పారు. ఇక సెప్టెంబర్ తర్వాతే సీమాంధ్ర రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని జైరాం రమేష్ వివరించారు.