ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు | Congress Leaders assassitionDemocracy is | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

Published Fri, Nov 1 2013 4:01 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు - Sakshi

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ.. దానిని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి, గట్టు ధ్వజం
జానా, ఉత్తమ్‌లు కిరణ్ కింద ఎందుకు పనిచేస్తున్నారు?

 
 సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ.. దానిని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంత్రులుగా రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాపాడాల్సిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలే స్వయంగా వాటిని కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారైతే తాను సమైక్యవాద చాంపియన్ అని చెప్పుకుంటున్న సీఎం కిరణ్ కింద పనిచేయడానికి సిగ్గేయడం లేదా? అని అన్నారు.
 
 భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకోవడం చూస్తుంటే వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు వేరువేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఫైళ్లపై సంతకాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. చీకట్లో అన్ని వ్యవహారాలు నెరుపుతూ, పైకి మాత్రం తెలంగాణవాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement