విజయవాడ:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై వైఎస్సార్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సోనియా గాంధీ హెడ్ ఆఫీస్ అయితే.. చంద్రబాబు బ్రాంచ్ ఆఫీస్ అని ఆయన విమర్శించారు. విభజనకు సోనియా గాంధీ చంద్రబాబును బ్రాంచ్ ఆఫీస్ గా చేసుకుందని గట్టు ఎద్దేవా చేశారు. చంద్రబాబు డస్ట్‌బిన్‌గా తప్ప రాజకీయాలకు పనికి రాడని ఆయన తెలిపారు. భారత దేశం ఆత్మగౌరవం నుంచి పుట్టిందే వైఎస్సార్ సీపీ అని గట్టు తెలిపారు.
మహిళా బిల్లు, బీసీ బిల్లుల గురించి మాట్లాడని నాయకులు రాష్ట్రాన్ని మక్కలు చేయడానికి మాత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రావడాన్ని తప్పుబట్టారు. దీని వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనబడుతుందన్నారు.