రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు? | gattu ramachandra rao takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు?

Published Tue, May 27 2014 4:55 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు? - Sakshi

రక్త చరిత్ర మీది కాదా చంద్రబాబు?

హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. చంద్రబాబు ఒక విషసర్పం లాంటివాడని విమర్శించారు. ఈ రోజు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గట్టు మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది మీరు కాదా?అంటూ బాబును నిలదీశారు. ఆయన రక్తచరిత్ర ఉన్న వ్యక్తి అని గట్టు ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్టీఆర్ చివరి ప్రసంగాన్ని మరోసారి మహానాడు వేదికపై ప్రసారం చేయగలవా? అంటూ ప్రశ్నించారు.

 

టీడీపీ మహానాడు అనేది 'సొంతడబ్బా-పరనిందలా' కనిపిస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చంపుతున్నది వాస్తవం కాదా?అని గట్టు నిలదీశారు. ఎన్నికల హామీలను నెరవేర్చేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement