'కేసీఆర్ భావ దారిద్ర్యాన్ని ప్రదర్శించారు' | KCR Exhibits Emotional Poverty, says Gattu Ramachandra Rao | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ భావ దారిద్ర్యాన్ని ప్రదర్శించారు'

Published Mon, Sep 30 2013 3:01 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

'కేసీఆర్ భావ దారిద్ర్యాన్ని ప్రదర్శించారు' - Sakshi

'కేసీఆర్ భావ దారిద్ర్యాన్ని ప్రదర్శించారు'

హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేసీఆర్  వైఖరితో రాష్ట్రం బాధతో ఘోషిస్తోందని ఆపార్టీ విమర్శించింది. బాబు, కిరణ్‌, కేసీఆర్‌లు ఇరుప్రాంత హీరోలుగా మిగిలిపోవడం కోసం జగన్‌పై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.

 

టీఆర్ఎస్ పెత్తనాన్ని 10 జిల్లాలకు పెంచడం కోసం కేసీఆర్‌ ప్రజల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రజల్లో ఉనికి ఉండదనే భయంతోనే కేసీఆర్  పావులు కదుపుతున్నారని గట్టు విమర్శించారు. సకల జన భేరీలో కేసీఆర్ భావ దారిద్ర్యాన్ని ప్రదర్శించారని గట్టు ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement