వైఎస్సార్ పథకాలే గెలిపిస్తాయ్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తాయని వైఎస్సార్ సీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. రాజన్న ఆశీస్సులతో తప్పకుండా జహీరాబాద్‌లో వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేస్తామన్నారు. సోమవారం ఆయన జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు ఉజ్వల్‌రెడ్డి, అప్పారావు షెట్కార్, కిష్ణారెడ్డి, గౌ రిరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి సంగారెడ్డిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మొహియొద్దీన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ శరత్‌కు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మొహియొద్దీన్, వైఎస్సార్ ఆశీ స్సులతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఆ మహానేత పథకాలన్నీ మళ్లీ కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ మాట తప్పారు
తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి, ము స్లింను ఉప ముఖ్యమంత్రి చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఫక్తు కుటుంబ పార్టీగా మారిందన్నారు. గెలిచే స్థానాలను కుటుంబసభ్యులకు కేటాయించి, ఓడిపోయే స్థానాలను మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తున్నారని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వారిని విస్మరించిన కేసీఆర్, కేవలం తన అనుచరులకు, వెలమ, చౌదరి వర్గాలకు చెందిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
జహీరాబాద్ లోక్‌సభ ప్రాం తం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిందని మొహియొద్దీన్ ఆవేదన వ్యక్తం చే శారు. గతంలో ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహి ంచిన నేతలు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. తనను గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని హైదరాబాద్‌లాగా అభివృద్ధి చేస్తానన్నారు.