ఇంటింటికి వైఎస్‌ఆర్ సీపీ ప్రచార రథం
బిచ్కుంద, న్యూస్‌లైన్ : బిచ్కుంద మండలంలో ఈ నెల 16 నుంచి వైఎస్‌ఆర్ సీపీ ఇంటింటి ప్రచార రథం ప్రారంభమవుతుందని జిల్లా అధికార ప్రతినిధి నీరడి లక్ష్మణ్ అన్నారు. శనివారం బిచ్కుందలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ప్రణాళికలు రూపొందించి ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని ఆయన సూ చించారు. పేదల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన తొమ్మిది సంక్షేమ పథకాల అమలు కేవలం వైఎస్‌ఆర్ సీపీతోనే సాధ్యమవుతుందని అన్నారు.
రాజన్న పాలన కోసం ప్రజలు వైఎస్సార్ పార్టీని ఆహ్వానిస్తున్నారని అన్నారు. పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ వృద్ధులు ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. ఒక్క పింఛన్, రేషన్ కార్డు మంజూరు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసుగు చెందారని అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ప్రచారం కోసం గ్రామాలలోకి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుంటూ పార్టీలో చేరుతున్నారన్నారు.
గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయలు లేక ప్రజలు కొట్టుమి ట్టా డుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా యువజన కార్యదర్శి కాశీరాం, జిల్లా కార్యదర్శి శాంతికుమార్, కార్మిక జిల్లా విభాగం కన్వీనర్ కటారి రాములు, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ మండలాల కన్వీనర్లు నరేష్ గౌడ్, లక్ష్మణ్, షాకిబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.