తెలుగువారిని విడదీయలేరు: వైఎస్ జగన్ | No one can divide Telugu people, says YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

తెలుగువారిని విడదీయలేరు: వైఎస్ జగన్

Published Mon, Jun 2 2014 12:03 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

తెలుగువారిని విడదీయలేరు: వైఎస్ జగన్ - Sakshi

తెలుగువారిని విడదీయలేరు: వైఎస్ జగన్

హైదరాబాద్ : రాష్ట్రాన్ని విడదీసినా... తెలుగువారిని విడదీయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడునీడగా ఉంటుందన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కొలువై ఉన్నారని జగన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా మారిందని గర్వంగా చెప్తున్నామన్నారు.

 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. కేసీఆర్ చేసే ప్రతి మంచి పనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జగన్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు, పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement