వైఎస్సార్ సీపీతోనే సంక్షేమ పథకాల అమలు
మునుగోడు ఎమ్మెల్యేఅభ్యర్థి ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి
చౌటుప్పల్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. వృద్ధులు, రైతులు, మహిళలు, యువత ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు సాఫీగా అమలవుతాయన్నారు.
మహానేత మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎ స్సార్ సంక్షేమ పథకాలకు తూ ట్లు పొడిచిందన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో ఓ రూపంలో లబ్ధి పొందిందన్నారు. వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందుతున్నాయన్నారు. రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకొని పాలించాయన్నారు.
అందుకే వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు గూడూరు సరళారెడ్డి, ఉపసర్పంచ్ చింతల సంతోష్‌కుమార్, గుండెపురం వెంకటేష్, లగ్గోని శివశంకర్, నవీన్‌చారి, ఎడ్ల సురేష్‌రెడ్డి, జి.మహేష్, లింగస్వామి, సంతోష్, జానీ, సైదులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.