assembly elections in 2014
-
ఈ సారీ సీటు మార్చేద్దాం..
ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో స్థానం ఓటమి భయంతో నియోజకవర్గాల మార్పు గంటా రాజకీయ ప్రస్థానం తీరిది సాక్షి, విశాఖపట్నం : ప్రతి ఎన్నికకు కొత్తనియోజకవర్గాన్ని వెతుక్కుని అటు వలసపోవడం మాజీ మంత్రి గంటాకు మామూలైంది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సీటుమార్చి అనకాపల్లి నుంచి పోటీచేశారు. 2014 ఎన్నికల్లో తిరిగి అదేస్థానం నుంచి పోటీచేయాలని భావించినా సర్వే చేయించి చూసుకుంటే చిత్తుగా ఓడిపోతారని తేలడంతో మళ్లీ కొత్త సీటు కోసం ఎత్తుగడలు వేశారు. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పోటీచేయాలని ప్రయత్నించిన భీమిలికి మారి ఇప్పుడు అక్కడినుంచి పోటీచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న అయిదేళ్లలో నియోజకవర్గ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన వ్యాపారాల్లో మునిగితేలడం ఆయనకు అలవాటు. దీంతో ఐదేళ్ల తరువాత ప్రజలకు ముఖం చూపేందుకు మనసొప్పక ఏకంగా నియోజకవర్గాన్నే మార్చేస్తున్నారు. వాస్తవానికి భీమిలినుంచి పోటీచేయడానికి గంటాకు ఏమాత్రం ఆసక్తిలేదు. ముందు విశాఖ ఎంపీ స్థానానాకి పోటీచేయాలనుకున్నారు. కాని వైఎస్సార్సీపీ నుంచి విజయమ్మ బరిలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో అప్పట్లో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆతర్వాత అనకాపల్లికే వెళ్లాలని చివరకు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గ్రహించి తనకోసం నియోజకవర్గం త్యాగం చేసే నేత కోసం వెదుక్కున్నారు. చివరకు తనను నమ్మివచ్చిన బృంద సభ్యుడు అవంతిపై కన్నేశారు. ఆయన ఎప్పటినుంచో అక్కడ ఖర్చుపెట్టి బలంపెంచుకుంటే తీరా వచ్చి తన రాజకీయ అవసరం కోసం ఈయన్ను బలిచేసి అనకాపల్లి ఎంపీ సీటుకు పంపించారు. దీంతో గంటా వైఖరిపై అవంతి కక్కలేకమింగలేక అన్నట్లున్నారు. -
ఇక మహాసంగ్రామం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సుమారు నెల రోజులుగా సాగుతున్న స్థానిక పోరు శుక్రవారం ముగిసీ ముగియగానే.. శనివారం మహా సంగ్రామానికి తెరలేవనుంది. రాష్ట్రంలో ‘సెమీ ఫైనల్స్’గా పరిగణన పొందిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు తెరపడిన వెంటనే.. ఫైనల్స్‌గా భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోరుకు సిద్ధం కావలసి రావడంతో రాజకీయ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా.. ఎన్నికల కోలాహలం ఉన్నన్నాళ్లూ.. తిండికీ, తాగుడికీ వెతుక్కోవలసిన అగత్యం లేని వాళ్లూ, ఓటుకు వెలగట్టి చెల్లిస్తే నిస్సంకోచంగా పుచ్చుకునే వారూ చంకలు గుద్దుకుంటున్నారు. జిల్లాలో రాజమండ్రి కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగరపంచాయతీలు, 57 జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల సందడికి శుక్రవారం తెరపడింది.ఇంతలోనే శనివారం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల స్వీకరణా మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ శుక్రవారం సమీక్షించారు. నేటి వరకూ స్థానిక సమరంలో తలమునకలైన వివిధ పార్టీల నేతలు కూడా వెనువెంటనే సార్వత్రిక ఎన్నికల సన్నాహాలకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో మూడు పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకోగా తెలుగుదేశం వత్తాసుగా నిలిచిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. సమైక్యాంధ్ర కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. వైఎస్సార్ సీపీ జిల్లాలో దాదాపు అన్ని స్థానాలపైనా ఒక స్పష్టతతో ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ జనభేరి సభల్లో అమలాపురం, కాకినాడ పార్లమెంటు స్థానాలకుపినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, రామచంద్రపురం, ముమ్మిడివ రం, పిఠాపురం, తుని, పెద్దాపురం ని యోజకవర్గాలకు మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, గుత్తుల సాయి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, తోట సుబ్బారావునాయుడులను అభ్యర్థులు గా ప్రకటించారు. మిగిలిన స్థానాలపై కూడా కసరత్తు తుది దశకు చేరుకుంది. బాబుకు షాక్ ఇవ్వనున్న గోరంట్ల..? విభజనలో కాంగ్రెస్‌తో అంటకాగిన టీడీపీ బీజేపీతో పొత్తు సంగతి తేల్చుకోలేక తలపట్టుకుంటోంది. రాజమండ్రి సిటీ, రాజోలు స్థానాలు బీజేపీకి విడిచి పెట్టే ప్రయత్నంలో పిల్లిమొగ్గలు వేస్తోంది. మండపేట, రాజానగరం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, తుని, పి.గన్నవరం, ముమ్మిడివరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ పార్లమెంటు స్థానం కోసం బీజేపీ పట్టుబడుతున్నందున.. ఆ సీటుపై ఆశతో కాంగ్రెస్ నుంచి టీడీపీ పంచన చేరిన మాజీ మంత్రి తోట నరసింహం పరిస్థితి ఏమిటనేది తేలడం లేదు. బీజేపీకి ఇస్తారంటున్న రాజమండ్రి సిటీ విషయంలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒకటి, రెండురోజుల్లో చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. కడరూ కరువైన ‘జై సమైక్యాంధ్ర’ నిన్నమొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజనతో కుదేలై అభ్యర్థుల కోసం భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సై తం అభ్యర్థులను నిలపలేక చేతులెత్తేసి న ఆ పార్టీ ఇప్పుడు కాకినాడ నుంచి సిట్టింగ్ ఎంపీ పళ్లంరాజును మాత్రమే ప్రకటించి, మిగిలిన వారి కోసం వేట ప్రారంభించింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన జై సమైక్యాంధ్ర పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేసుకోలేక తంటాలు పడుతున్నారు. కేడర్ లేని ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి. -
టీఆర్ఎస్ జాబితా పూర్తి
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా ప్రక్రియ పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న పరకాల, మహబూబాబాద్ అసెంబ్లీ, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. టీఆర్ఎస్కు సవాలుగా నిలిచిన పరకాల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతికి సీటు నిరాకరించారు. న్యాయవాద జేఏసీలో కీలకంగా పనిచేసిన ముద్దసాని సహోదర్‌రెడ్డికి పరకాల సీటు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భిక్షపతి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయంపై సాధారణ రీతిలోనే స్పందించారు. నిజయోజకవర్గంలోని నాలుగు మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరకాల టికెట్ విషయంలో పార్టీ నాయకత్వం పునరాలోచించాలని కేసీఆర్‌ను కోరారు. భిక్షపతి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటున్నా... ఇప్పటికి మాత్రం అసమ్మతి వ్యక్తం చేయడం లేదు. ఇక.. పెండింగ్‌లో ఉన్న మహబూబాబాద్ అసెంబ్లీ స్థానానికి శంకర్‌నాయక్‌ను ఖరారు చేశారు. బానోత్ శంకర్‌నాయక్ 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం టీఆర్ఎస్ టికెట్ ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాంనాయక్‌కు దక్కింది. కేంద్ర మంత్రి బలరాంనాయక్‌పై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవడం ప్రొఫెసర్‌గా ఉన్న సీతారాంనాయక్తోనే సాధ్యమవుతందని టీఆర్ఎస్ భావించింది. గతంలో పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రునాయక్ పోటీకి ఆసక్తి కనబరచలేదని తెలిసింది. మొత్తానికి టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో మొదటిసారి అసంతృప్తులు, రాజీనామాల సెగలు లేకుండా టికెట్ల ప్రక్రియ ముగిసింది. ఉన్నతస్థారుులో ప్రయత్నాలు పరకాల అసెంబ్లీ టికెట్ సహోదర్‌రెడ్డికి కేటాయించడానికి ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. న్యా య విభాగంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒకరు స్వయంగా కేసీఆర్‌తో మాట్లాడినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న న్యాయవాదులకు జిల్లాకు ఒక టికెట్ ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయవాద జేఏసీలు కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చాయి. టీఆర్ఎస్తోనూ సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో సహోదర్‌రెడ్డికి సీటు ఇచ్చారు. సహోదర్‌రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావంలో పనిచేశారు. వరంగల్ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కకపోవడంతో సహోదర్‌రెడ్డి టీఆర్ఎస్కు దూరం జరిగారు. తెలంగాణ ఉద్యమ తీవ్రమైనప్పటి నుంచి ఆయ న న్యాయవాద జేఏసీలో క్రియాశీలకంగా పని చేశారు. 2012 పరకాల ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి మొలుగూరి భిక్షపతికి సీటు దక్కింది. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతి స్థానంలో సహోదర్‌రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. సహోదర్‌రెడ్డి సొంత ఊరు పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం దామెర. ప్రస్తుతం ఎలాంటి అసంతృప్తిని బయటికి వ్యక్తం చేయకున్నా... ఎన్నికల్లో సహోదర్‌రెడ్డికి భిక్షపతి ఎంతవరకు సహకరిస్తారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఇదే పరకాల టికెట్‌ను ఆశించిన మరో నేత నాగుర్లు వెంకటేశ్వర్లు స్పందన టీఆర్ఎస్ గెలుపోటముల్లో కీలకం కానుంది. -
వైఎస్సార్ పథకాలే గెలిపిస్తాయ్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తాయని వైఎస్సార్ సీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. రాజన్న ఆశీస్సులతో తప్పకుండా జహీరాబాద్‌లో వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేస్తామన్నారు. సోమవారం ఆయన జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు ఉజ్వల్‌రెడ్డి, అప్పారావు షెట్కార్, కిష్ణారెడ్డి, గౌ రిరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి సంగారెడ్డిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మొహియొద్దీన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ శరత్‌కు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మొహియొద్దీన్, వైఎస్సార్ ఆశీ స్సులతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఆ మహానేత పథకాలన్నీ మళ్లీ కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ మాట తప్పారు తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి, ము స్లింను ఉప ముఖ్యమంత్రి చేస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ఫక్తు కుటుంబ పార్టీగా మారిందన్నారు. గెలిచే స్థానాలను కుటుంబసభ్యులకు కేటాయించి, ఓడిపోయే స్థానాలను మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తున్నారని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వారిని విస్మరించిన కేసీఆర్, కేవలం తన అనుచరులకు, వెలమ, చౌదరి వర్గాలకు చెందిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. జహీరాబాద్ లోక్‌సభ ప్రాం తం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిందని మొహియొద్దీన్ ఆవేదన వ్యక్తం చే శారు. గతంలో ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహి ంచిన నేతలు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. తనను గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని హైదరాబాద్‌లాగా అభివృద్ధి చేస్తానన్నారు. -
నామినేషన్ల పర్వం
మహబూబ్‌నగర్ అర్బన్/వనపర్తి/ కొల్లాపూర్, న్యూస్‌లైన్: నాలుగోరోజు శనివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పా ర్లమెంట్ స్థానాలు, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు. స్థానిక అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన శంకర్‌రాథోడ్ బ్యాంకు జీరోఖాతాతో పాటు మరికొన్ని పత్రాలను పూర్తిస్థాయిలో తీసుకురాలేదని సిబ్బంది సూచించడంతో వెనుదిరిగారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్ల పర్వం కోలాహలంగా సాగింది. మాజీమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి.చిన్నారెడ్డి శనివారం వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను సమర్పించారు. మధ్యాహ్నం 2.49గంటలకు ఓ నామినేషన్ సెట్టు, 2.59 గంటలకు మరో సెట్టు నామినేషన్‌ను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఎప్పటిలాగే ఆయన నమ్మే ముస్లిం మతగురువు మౌలాలీబాబాను వెంట తెచ్చుకున్నారు. నామినేషన్ వేసి బయటకు రాగానే ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం పొందారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఇరగదిండ్ల శ్రీనివాస్ వైఎస్ఆర్ సీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను పార్టీకి చెందిన యువజన నాయకులు ప్రమోద్ ముది రాజ్ బలపర్చారు. దేవరకద్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దూర్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మరోసెట్టు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా చంద్రునాయక్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నారాయణపేట నుంచి టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా నామినేషన్ వేశారు. కొడంగల్ నుంచి టీఆర్ఎస్ తరఫున పున్నంచంద్ లాహోటీ తన నామినేషన్‌పత్రాలు దాఖలుచేశారు. మక్తల్ నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా వర్కటం జగన్నాథ్‌రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండయ్య నామినేషన్ వేశారు. -
రెండో లిస్ట్‌లో ముగ్గురు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్ తాజాగా మరొకరి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మంద జగన్నాథం టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అంజయ్య యాదవ్‌కే మరోసారి అవకాశం దక్కింది. నారాయణపేట అసెంబ్లీ స్థానం నుంచి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు, ఇటీవల పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థిత్వంపై స్పష్టత రాక మునుపే విఠల్‌రావు ఆర్య శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు టిక్కెట్‌పై హామీతో పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి టిఆర్ఎస్ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టిఆర్ఎస్ ముఖ్య నేత హరీష్‌రావును శివకుమార్‌రెడ్డి శనివారం కలిశారు. ఆయన పేరును ఆది, లేదా సోమవారం ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. కాగా కొడంగల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చిన తర్వాతే టిఆర్ఎస్ అభ్యర్థి పేరును వెల్లడించాలని పార్టీ భావిస్తోంది. త్వరలో కేసిఆర్ సభ జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావడతో నేతలందరూ నామినేషన్ల దాఖలుపై దష్టి సారించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసేందుకే నేతలు మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థుల ఎంపికతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ ప్రచార పర్వంలోనూ ఇదే వైఖరి అవలంభించాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌తో కనీసం రెండు చోట్ల బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు హరీష్‌రావు, కేటిఆర్, కేశవరావు వంటి నేతలతో రోడ్‌షోలు నిర్వహించేలా అభ్యర్థులు ప్రచార ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. -
38 నామినేషన్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నామినేషన్ల దాఖలుకు గడువు మూడు రోజులే ఉండటంతో అభ్యర్థులు పోటీ పడుతున్నా రు. పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన కొద్ది నామినేషన్లు వేస్తున్నారు. ప్రకటించకపోతే కూడా తమ మద్దతుదారులతో పార్టీల తరఫున, స్వతంత్రంగా నామినేషన్ పత్రాలు స మర్పింప జేస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లో పది అసెంబ్లీ స్థానాలకు 33 నామినేషన్లు రాగా, రెండు పార్లమెంట్ స్థానాలకు ఐదు నామినేషన్లు వచ్చాయి. నాలుగో రోజైన శనివారం అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది, పార్లమెంట్ స్థానాలకు మూడు వచ్చా యి. శనివారం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేష న్లు దాఖలు కాగా,మరో ఐదు నియోజకవర్గాలకు నామినేషన్లు రాలేదు. నాలుగో రోజు నామినేషన్లు ఇలా.. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి శనివారం స్వతంత్ర అభ్యర్థిగా నేతావత్ రాందాస్ నామినేషన్ వేశాడు. అలాగే పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి రెండు వచ్చాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎనిమిది నామినేషన్లు వచ్చాయి. సిర్పూర్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి గుల్లపల్లి బుచ్చిలింగం నామినేషన్ వేశారు. మంచిర్యాలకు టీడీపీ నుంచి బెల్లంకొండ మురళీధర్, ఆలిండియా ఫార్వడ్ బ్లాక్ నుంచి రంగు మల్లేషం, టీడీపీ నుంచి మరో అభ్యర్థి కొండేటి సత్యనారాయణలు నామినేషన్లు వేశారు. ఆసిఫాబాద్‌కు కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు, ఆదిలాబాద్‌కు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి షఫీఉల్లాఖాన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) నుంచి లంక రాఘవులు నామినేషన్లు వేశారు. నిర్మల్‌కు కప్పురపు ప్రవీణ్ కుమార్ స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. కాగా, మంచిర్యాల నియోజకవర్గానికి రంగు మల్లేషం 10 సెట్లు వేయగా, నిర్మల్‌లో స్వతంత్య్ర అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ 10 సెట్లు వేశారు. అయితే ముథోల్, బోథ్, ఖానాపూర్, చెన్నూర్, బెల్లంపల్లి స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.