కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నామినేషన్ల దాఖలుకు గడువు మూడు రోజులే ఉండటంతో అభ్యర్థులు పోటీ పడుతున్నా రు. పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన కొద్ది నామినేషన్లు వేస్తున్నారు. ప్రకటించకపోతే కూడా తమ మద్దతుదారులతో పార్టీల తరఫున, స్వతంత్రంగా నామినేషన్ పత్రాలు స మర్పింప జేస్తున్నారు.
ఈ నాలుగు రోజుల్లో పది అసెంబ్లీ స్థానాలకు 33 నామినేషన్లు రాగా, రెండు పార్లమెంట్ స్థానాలకు ఐదు నామినేషన్లు వచ్చాయి. నాలుగో రోజైన శనివారం అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది, పార్లమెంట్ స్థానాలకు మూడు వచ్చా యి. శనివారం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేష న్లు దాఖలు కాగా,మరో ఐదు నియోజకవర్గాలకు నామినేషన్లు రాలేదు.
నాలుగో రోజు నామినేషన్లు ఇలా..
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి శనివారం స్వతంత్ర అభ్యర్థిగా నేతావత్ రాందాస్ నామినేషన్ వేశాడు. అలాగే పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి రెండు వచ్చాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎనిమిది నామినేషన్లు వచ్చాయి. సిర్పూర్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి గుల్లపల్లి బుచ్చిలింగం నామినేషన్ వేశారు. మంచిర్యాలకు టీడీపీ నుంచి బెల్లంకొండ మురళీధర్, ఆలిండియా ఫార్వడ్ బ్లాక్ నుంచి రంగు మల్లేషం, టీడీపీ నుంచి మరో అభ్యర్థి కొండేటి సత్యనారాయణలు నామినేషన్లు వేశారు.
ఆసిఫాబాద్‌కు కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు, ఆదిలాబాద్‌కు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి షఫీఉల్లాఖాన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) నుంచి లంక రాఘవులు నామినేషన్లు వేశారు. నిర్మల్‌కు కప్పురపు ప్రవీణ్ కుమార్ స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. కాగా, మంచిర్యాల నియోజకవర్గానికి రంగు మల్లేషం 10 సెట్లు వేయగా, నిర్మల్‌లో స్వతంత్య్ర అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ 10 సెట్లు వేశారు. అయితే ముథోల్, బోథ్, ఖానాపూర్, చెన్నూర్, బెల్లంపల్లి స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.
38 నామినేషన్లు
Published Sun, Apr 6 2014 2:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM
Advertisement
Advertisement