దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రమాదవశాత్తు మరణించి నాలుగేళ్లు గడుస్తున్నా వాస్తవాలు మాత్రం బయటకి రాలేదని వైఎస్సార్ సీపీ తెలిపింది.
విజయవాడ:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రమాదవశాత్తు మరణించి నాలుగేళ్లు గడుస్తున్నా వాస్తవాలు మాత్రం బయటకి రాలేదని వైఎస్సార్ సీపీ తెలిపింది. రేపు మహానేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించింది. వైఎస్సార్ మరణంపై 'నాలుగేళ్లు-నాలుగు సందేహాలు' అనే పుస్తకాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. వైఎస్సార్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
సాంకేతిక లోపంతో హెలికాప్టర్ కూలిందని గతంలో కేబినెట్ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అప్పట్లో చేసిన త్యాగి దర్యాప్తు సరిగి లేదని ఆయన విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి బయట ఉంటే వాస్తవాలు వెలుగు చూస్తాయనే ఉద్దేశంతో ఆయనపై కుట్ర పన్ని జైలుకు పంపారని గట్టు మండిపడ్డారు.