
అంతరించే పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ మండిపడింది. చంద్రబాబుకి అధికారం పిచ్చి పట్టిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన గట్టు.. వైఎస్సార్ సీపీపై బురదచల్లే యత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. .'నీ యొక్క పేరును నీ కుటుంబమే అసహ్యించుకుంటుంది. నీ కుటుంబలో ఏ ఒక్కరూ కూడా నీ పేరు పలకాడానికే ఇష్టపడరు. ఇటువంటి తరుణంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి బాబుకు ఎక్కడదని' గట్టు ప్రశ్నించారు.
ఆయన మతిస్థిమితం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలున్నాయని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలని కుటుంబ సభ్యులను కోరుతున్నానన్నారు. చంద్రబాబు ఎన్ని కుయక్తులు చేసినా అంతరించే పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఆయన మిగిలిపోతారని గట్టు ఎద్దేవా చేశారు. తెలుగు జాతిని ముక్కలు చేసిన ఘనత బాబుకే దక్కుంతుదున్నారు.కుట్రల్లో కుమ్మక్కుల్లో ఆరితేరిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని అన్నారు.చంద్రబాబుకి రాజకీయాల్లో ఇక కాలం చెల్లిందని గట్టు తెలిపారు. ఇకనైనా పార్టీ కార్యకర్తలు మేల్కొని పార్టీని బ్రతికించుకోవాలన్నారు.