
చంద్రబాబు నిర్వాకం వల్లే జలాల సమస్య : గట్టు
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే మిగులు జలాలను మనం దక్కించుకోలేకపోయామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్ర రావు, వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ట్రిబ్యునల్లో వేసిన అఫిడవిట్లో ప్రాజెక్ట్కు ఆటంకం కలగకూడదనే చట్టం చేయాలని కోరినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని చెప్పారు. అవే నిర్మించి ఉంటే ఇవాళ రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.
ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకు కళ్లు మూసుకున్నారని వారు ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాలను తమ పార్టీపై రుద్దాలని చూస్తున్నారన్నారు.